Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.11 కోట్లు
స్వామి వారిని దర్శించుకున్న భక్తులు 55,747
Tirumala Rush : తిరుమల – ప్రసిద్ద పుణ్య క్షేత్రం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిశాయి. సెప్టెంబర్ 18 నుంచి 26 మంగళ వారం వరకు అంగరంగ వైభవోపేతంగా నిర్వహించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) . స్వామి వారు మాడ వీధుల్లో ఊరేగారు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
Tirumala Rush with Devotees
ఇదిలా ఉండగా నిన్న తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 55 వేల 747 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి 21 వేల 774 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
ఇక నిత్యం భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.11 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇక స్వామి వారి దర్శనం కోసం భక్తులు డైరెక్ట్ లైన్ లో వేచి ఉన్నారు.
ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 4 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపింది టీటీడీ(TTD). ఇదిలా ఉండగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినందుకు భక్తులకు ధన్యవాదాలు తెలిపారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
Also Read : Telangana Polls Comment : ముందస్తు ఎన్నికలకు ముహూర్తం