Tirumala Rush : భక్తులతో తిరుమల కిటకిట
71,488 మంది భక్తుల దర్శనం
Tirumala Rush : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి తండోప తండాలుగా తరలి వచ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (TTD ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మా రెడ్డి.
Tirumala Rush with Devotees
వైకుంఠ ద్వార దర్శనం పురస్కరించుకుని బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే భక్తులకు ఉచితంగా దర్శన భాగ్యం కల్పించేందుకు గాను 10 కౌంటర్లను ఏర్పాటు చేసి సర్వ దర్శన టోకెన్లను జారీ చేసినట్లు వెల్లడించారు.
రోజుకు 70 నుంచి 80 వేల నుంచి టోకెన్లు జారీ చేశామన్నారు. ఇదే సమయంలో 71 వేల 488 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నట్లు తెలిపారు. 19 వేల 137 మంది తలనీలాలు భక్తులు సమర్పించుకున్నారు. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.17 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
Also Read : Kalyanram : కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్