TTD BOARD : జీయ‌ర్ మ‌ఠాల‌కు నిధులు పెంపు

టీటీడీ పాల‌క మండ‌లి నిర్ణ‌యాలు

TTD BOARD : తిరుమ‌ల – టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. జీయ‌ర్ మ‌ఠాల‌కు ప్ర‌స్తుతం ఇస్తున్న నిధుల కంటే అద‌నంగా రూ.కోటి పెంచింది. టీటీడీ స‌మావేశం ముగిసిన అనంత‌రం చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయిస్ కు ఇళ్ల స్థ‌లాల‌ను ఇచ్చేందుకు ఓకే చెప్పింది. పోటు కార్మికుల‌కు వేత‌నం పెంపు.

TTD BOARD Approved

వంద‌ల ఏళ్లుగా శ్రీ‌వారి ఆల‌య అర్చ‌క కైంక‌ర్యాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న శ్రీ పెద్ద‌జీయ‌ర్ మ‌ఠానికి రూ.60 ల‌క్ష‌లు, శ్రీ చిన్న‌జీయ‌ర్ మ‌ఠానికి రూ.40 ల‌క్ష‌లు ఆర్థిక స‌హ‌కారం అందించాల‌ని నిర్ణ‌యం. టీటీడీ(TTD)లోని పలు విభాగాల్లో వర్క్‌ కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న కార్మికులకు వేతనాలు పెంచడం జరిగింది. స్కిల్డ్‌ కార్మికులకు రూ.15 వేల నుండి రూ.18,500/-కు, సెమిస్కిల్డ్‌ కార్మికులకు రూ.12 వేల నుండి రూ.15 వేలకు, అన్‌స్కిల్డ్‌ కార్మికులకు రూ.10,340 నుండి రూ.15 వేలకు పెంచామ‌ని తెలిపారు చైర్మ‌న్.

క‌ళ్యాణ క‌ట్ట‌లో విధులు నిర్వహిస్తున్న పీస్‌రేట్‌ క్షురకులకు నెలకు రూ.20 వేలు కనీస వేతనం చెల్లించాల‌ని నిర్ణ‌యం. రూ.14.47 కోట్లతో తిరుమలలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డులో గోగర్భం డ్యామ్‌ సర్కిల్ వ‌రకు శాశ్వత క్యూలైన్ల నిర్మాణానికి టెండరు ఖరారుకు ఆమోదం.

టీటీడీ పరిపాలన భవనంలో పాలనా సౌలభ్యం కోసం రూ.6.15 కోట్లతో సెంట్రలైజ్డ్‌ రికార్డు స్టోర్‌ నిర్మాణానికి టెండరు ఆమోదం తెలిపామ‌న్నారు. తిరుమ‌ల‌లో పాత పోలీసు క్వార్టర్ట్స్‌ను రూ.2.87 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు టెండరు ఖరారుకు ఆమోదం.

రూ.6.32 కోట్లతో వరాహస్వామి విశ్రాంతి గృహం నుండి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డు ఏర్పాటుకు టెండర్ల ఆమోదం తెలిపింది.

Also Read : Tirumala Rush : భ‌క్తుల‌తో తిరుమ‌ల కిట‌కిట

Leave A Reply

Your Email Id will not be published!