Tirumala Rush : పుణ్య క్షేత్రానికి పోటెత్తిన భక్తులు రూ. 4.20 కోట్లు ఆదాయం
హుండీ ఆదాయం రూ. 4.20 కోట్లు
Tirumala Rush : శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుమలకు భక్తులు పోటెత్తారు. రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది. గత రెండు నెలలుగా భక్తుల తాకిడి పెరిగింది. శనివారం, ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున పుణ్య క్షేత్రానికి చేరుకున్నారు. ఆదివారం ఒక్క రోజే 87 వేల 792 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
Tirumala Rush Huge
స్వామి వారికి మొక్కులు తీర్చుకునేందుకు పోటీ పడ్డారు భక్తులు. ఇక తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 29 వేల 656కి చేరుకుంది. మొన్నటి కంటే నిన్న ఒక్క రోజు శ్రీనివాసుడి హుండీ ఆదాయం భారీగా పెరగడం విశేషం. రూ. 4.20 కోట్లు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించు కునేందుకు తిరుమల లోని 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారని పేర్కొంది. సర్వ దర్శనం కోసం (టోకెన్లు లేకుండా) వేచి ఉన్న వారి భక్తులకు కనీసం 18 గంటలకు పైగా పడుతుందని టీటీడీ అంచనా వేసింది.
ఇదిలా ఉండగా ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా భక్తుల సంఖ్య తగ్గక పోగా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇక సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసింది.
Also Read : Gudivada Amarnath : పవన్ జర నోరు జాగ్రత్త – అమర్నాథ్