Tirumala Rush : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లు

ద‌ర్శించుకున్న భ‌క్తుల సంఖ్య 75,804

Tirumala Rush : తిరుమ‌ల – పుణ్య క్షేత్రం తిరుమ‌ల భ‌క్తుల‌తో పోటెత్తింది. రోజు రోజుకు శ్రీ‌నివాసుడిని ద‌ర్శించు కునేందుకు భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్త బాంధ‌వుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ).

Tirumala Rush with Devotees

స్వామి వారి ఆదాయం గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. నిన్న తిరుమ‌ల‌ను 75 వేల 804 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. శ్రీ‌వారి నామ స్మ‌ర‌ణ‌తో తిరుమ‌ల గిరులు ద‌ద్ద‌రిల్లాయి. ఎక్క‌డ చూసినా భ‌క్తుల సందోహంతో నిండి పోయింది.

గోవిందా గోవిందా , శ్రీ‌నివాసా గోవిందా, అనాధ ర‌క్ష‌క గోవిందా, ఆప‌ద మొక్కుల వాడా గోవిందా, అదివో అల్ల‌దివో శ్రీ‌హ‌రి వాస‌ము , ప‌ది వేల శేషుల ప‌డ‌గ‌ల మ‌యం అంటూ భ‌క్తులు స్వామి వారిని స్మ‌రించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు.

శ్రీ‌నివాసుడికి 32 వేల 198 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. భ‌క్తులు నిత్యం స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా స‌మ‌ర్పించే హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వ‌చ్చిన‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(TTD) వెల్ల‌డించింది.

శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం తిరుమ‌ల లోని 31 కంపార్ట్ మెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నారు. ఇక ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌లిగేందుకు నీసం 24 గంట‌ల‌కు పైగా ప‌ట్ట‌నుంద‌ని టీటీడీ తెలిపింది.

Also Read : Chandrababu Naidu Arrest Comment : బాబు అరెస్ట్ త‌ప్ప‌దా..?

Leave A Reply

Your Email Id will not be published!