Tirumala Tirupati : శ్రీవారి భక్తులకు శుభవార్త
24న అంగ ప్రదక్షిణం టోకెన్లు
Tirumala Tirupati : ఇక వేసవి కాలం ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తిరుమలను దర్శించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. నిత్యం స్వామి వారిని దర్శించుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati) పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అయినా అంచనాలకు మించి భక్తులు దర్శించు కోవడంతో నానా ఇబ్బందులు పడుతోంది. కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. ఇదే సమయంలో దశల వారీగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా దర్శన భాగ్యం కల్పిస్తోంది టీటీడీ.
ఇందులో భాగంగా శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 24న శుక్రవారం ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టికెట్ల కోటా విడుదల చేయనుంది. ఈ విషయాన్ని అధికారికంగా టీటీడీ(Tirumala Tirupati) ప్రకటించింది. వచ్చే ఏప్రిల్ , మే నెలలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లను మధ్యాహ్నం నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది. ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఉదయం 10 గంటలకు ఇస్తున్నట్లు తెలిపింది టీటీడీ.
అంతే కాకుండా మార్చి నెలలో జరిగే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం , సహస్ర దీపాలంకరణ సేవ వర్చువల్ సేవా టికెట్ ల కోటాను సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది టీటీడీ. ఆఫ్ లైన్ లో కూడా దర్శనానికి సంబంధించి టికెట్లను జారీ చేస్తున్నట్లు తెలిపింది.
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మరో సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది. ఆఫ్ లైన్ లో కూడా టికెట్లను విక్రయిస్తోంది. తిరుపతి ఎయిర్ పోర్ట్ లో కూడా అందుబాటులో ఉంచింది. అయితే ఆధార్ కలిగిన వారికే ఇవ్వనున్నట్లు తెలిపింది.
Also Read : సూర్య జోశ్యుల ‘వీడే బాలా’