TMC Amit Shah : అమిత్ షా కామెంట్స్ టీఎంసీ సీరియస్
35 సీట్లు ఇస్తే బెంగాల్ సర్కార్ క్లోజ్
TMC Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా బెంగాల్ లో ఎంపీ సీట్లపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలోని 42 సీట్లలో 35 సీట్లు గనుక బీజేపీకి ఇస్తే రాష్ట్రంలో టీఎంసీ సర్కార్ ఉండదని, దీదీ పొలిటికల్ కెరీర్ క్లోజ్ అవుతుందని స్పష్టం చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది టీఎంసీ(TMC Amit Shah). ఒక బాధ్యత కలిగిన హోం శాఖ మంత్రి ఇలాగేనా మాట్లాడేది అంటూ మండిపడింది. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎలా కూల్చి వేస్తాడో దేశ ప్రజలకు చెప్పాలన్నారు.
ఓ వైపు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్యానికి ప్రమాదం నెలకొందని ఇప్పటికే తాము మొత్తుకుంటూ వచ్చామని పేర్కొంది. కానీ మోదీ సర్కార్ నియంత పాలన సాగిస్తోందని ఆరోపించింది. ఇందుకు తగ్గినట్లుగానే అమిత్ షా తనలోని కుట్ర కోణాన్ని బహిరంగంగానే బయట పెట్టారంటూ వాపోయింది. ఇకనైనా రాష్ట్ర, దేశ ప్రజలు మోదీ సర్కార్ విపక్షాల పట్ల అనుసరిస్తున్న వైఖరి ఏమిటో గమనించాలని కోరింది.
రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్ర కోణం ఏమిటో బయట పడిందని పేర్కొంది. ఇదిలా ఉండగా రాష్ట్ర సర్కార్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో పోరాటానికి నాయకత్వం వహించినందుకు ప్రతిపక్ష నేత సువేందు అధికారిని బీర్బూమ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రశంసించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లు కట్టబెట్టారు. దీదీ అవినీతి, అక్రమాలను నిత్యం ఎండగడుతూ వస్తున్నారు సువేందు అని పేర్కొన్నారు షా(Amit Shah).
ఇదే సమయంలో గోవుల అక్రమ రవాణాలో కీలక సూత్రధారిని కూడా అరెస్ట్ చేశామన్నారు. టీఎంసీ(TMC) నిప్పులు చెరిగింది. సువేందు అధికారిపై ఎన్నో అవినీతి, అక్రమ కేసులు ఉన్నాయని ఆ విషయం తెలుసుకుంటే మంచిదని సూచించింది. నారద స్టింగ్ ఆపరేషన్ లో డబ్బులు తీసుకుంటూ అడ్డంగా దొరికాడని ఆరోపించింది. మొత్తంగా షా చేసిన కామెంట్స్ పై టీఎంసీ కన్నెర్ర చేసింది.
Also Read : బీజేపీకి 35 సీట్లిస్తే దీదీ సర్కార్ క్లోజ్