CM KCR : ఆనాటి త్యాగాల ఫలితమే నేటి దేశం -కేసీఆర్
స్వాతంత్రానికి పూర్వమే తెలంగాణ అభివృద్ధి
CM KCR : ఆనాటి త్యాగాల ఫలితమే నేటి భారత దేశమని పేర్కొన్నారు సీఎం కేసీఆర్(CM KCR). తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించారు. స్వాతంత్రానికి పూర్వమే తెలంగాణ ఎంతో అభివృద్ది చెందిందన్నారు.
ఆనాటి భారత పాలకులు ముందు చూపుతో వ్యవహరించడం వల్ల ఇవాళ మనం సుఖ సంతోషాలతో బతుకుతున్నామని చెప్పారు సీఎం. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండాను ఎగుర వేశారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు కేసీఆర్. మహాత్ముడు నెలకొల్పిన విలువలు, జవహర్ లాల్ నెహ్రూ ముందు చూపు, సర్దాల్ వల్లభాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం , కుల, మత, ప్రాంతాలకు అతీతంగా దేశ భక్తి భావనను పెంపొందించిన మౌలానా అబుల్ కలాం వంటి నేతలు చేసిన కృషి ప్రశంసనీయమని కొనియాడారు.
వారందించిన స్పూర్తితో తాను తెలంగాణలో పాలన సాగిస్తున్నానని చెప్పారు. ఇదిలా ఉండగా దేశానికి స్వేచ్ఛ లభించినా 1948 నుంచి 1956 దాకా సొంత రాష్ట్రంగా కొనసాగింది తెలంగాణ. మిగులు నిధులతో కూడిన నాటి హైదరాబాద్ ఎంతగానో అభివృద్ది చెందిందని ప్రశంసించారు.
ఆనాటి రాష్ట్రాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ఏపీని ఏర్పాటు చేశారు. కానీ అడుగడుగునా దోపిడీ, దౌర్జన్యాల కారణంగా తెలంగాణ ఏర్పాటు కోసం పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు కేసీఆర్(CM KCR).
2001లో తెలంగాణ కోసం సమర శంఖం పూరించానని అన్నారు. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటు సాకారమైందన్నారు సీఎం. ఇవాళ దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు.
ప్రభుత్వం అవలంభించిన విధానాల వల్ల రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగిందని చెప్పారు.
Also Read : విద్య తోనే భారత దేశం అభివృద్ది