Gujarat CM : రూ. 1,020 కోట్ల‌తో టూరిజం పాల‌సీ – సీఎం

ఆవిష్క‌రించిన భూపేంద్ర ప‌టేల్

Gujarat CM :  గుజ‌రాత్ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు సినిమాటిక్ టూరిజం పాల‌సీని ఆవిష్క‌రించింది. రూ. 1,020 కోట్ల విలువైన ఒప్పందాల‌పై సంత‌కాలు చేశారు సీఎం(Gujarat CM).

ప‌ర్యాట‌క పాల‌సీ స్కీం రాష్ట్రంలోని ఫిల్మ్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ ప్రాజెక్టులు, ఫిల్మ్ మేకింగ్ ప్రాజెక్టుల కోసం వివిధ ఆర్థిక‌, ఆర్థికేత‌ర ప్రోత్సాహకాల‌ను అంద‌జేస్తుంంద‌న్నారు సీఎం.

స్వావ‌లంబ‌న గుజ‌రాత్ ను నిర్మించేందుకు టూరిజం పాల‌సీ దేశానికి ఉప‌యోగ ప‌డుతుంద‌న్నారు భూపేంద్ర ప‌టేల్. గాంధీ న‌గ‌ర్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర తొలి సినిమాటిక్ టూరిజం పాల‌సీని ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం, ఇత‌ర సంస్థ‌లు, వ్య‌క్తుల మ‌ధ్య కోట్లాది విలువైన అవ‌గాహ‌న ఒప్పందాలు (ఎంఓయూలు) చేసుకున్నారు. ఈ మేర‌కు సంత‌కాలు కూడా చేశారు.

ఎంఓయూల‌పై సంత‌కం చేసిన వారిలో ల‌క్ష్మీ ఫిల్మ్స్ , బాలీవుడ్ హ‌బ్ , న‌టుడు అజ‌య్ దేవ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ ఒప్పందాలు గుజ‌రాత్ లో ఫిల్మ్ మేకింగ్ , స్టూడియో ఇన్ ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ ,యాక్టింగ్ స్కూల్స్ ఏర్పాటుతో స‌హా ప్రాజెక్టుల‌కు సంబంధించిన‌వి ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఫిల్మ్ ఇన్ ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ ప్రాజెక్టుల విష‌యంలో ఎటువంటి గ‌రిష్ట ప‌రిమితి లేకుండా అర్హ‌త ఉన్న ప్రాజెక్టుల‌కు 20 శాతం వ‌ర‌కు మూల ధ‌న రాయితీ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం భూపేష్ ప‌టేల్(Gujarat CM).

100 ఎక‌రాల దాకా ప్ర‌భుత్వ భూమిని లీజుపై పొందేందుకు వీలుంటుంది. రిజిస్ట్రేష‌న్ ఫీజు, స్టాంప్ డ్యూటీపై 100 శాతం రీయింబ‌ర్స్ మెంట్ పొంద‌వ‌చ్చు.

Also Read : అధికార లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు

Leave A Reply

Your Email Id will not be published!