Vikram S Kirloskar : టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్మన్ కన్నుమూత
వ్యాపార దిగ్గజంగా పేరొందిన విక్రమ్ కిర్లోస్కర్
Vikram S Kirloskar : ప్రముఖ వ్యాపారవేత్త, టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 64 ఏళ్లు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అనుకోకుండా గుండె పోటు రావడంతో మృతి చెందారు. భారత దేశం దిగ్గజ వ్యాపార వేత్తను కోల్పోయింది.
విక్రమ్ కిర్లోస్కర్ మరణించిన విషయాన్ని టయోటా కిర్లోస్కర్ కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది. ఈ మేరకు గొప్ప నాయకుడిని తాము కోల్పోయామని పేర్కొంది. ఈ దుఖః సమయంలో విక్రమ్ కిర్లోస్కర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని తెలిపింది. విక్రమ్ కిర్లోస్కర్ ఎంఐటీలో చదివారు.
తనను తాను ఉద్వేగ భరితమైన ఇంజనీర్ గా ప్రూవ్ చేసుకున్నారు. 1888లో కిర్లోస్కర్ స్థాపించిన సమూహంలో నాల్గవ తరానికి చెందిన వ్యక్తి విక్రమ్ కిర్లోస్కర్. కిర్లోస్కర్ కమిన్స్ లో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లో ట్రైనీగా విక్రమ్ కిర్లోస్కర్(Vikram S Kirloskar) వ్యాపారంలో చేరాడు. బెంగళూరులోని హెబ్బల్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆయనకు భార్య గీతాంజలి కిర్లోస్కర్ , కూతురు మానసి కిర్లోస్కర్ ఉన్నారు. తదుపరి వైస్ చైర్మన్ బాధ్యతలు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు స్వీకరించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా విక్రమ్ కిర్లోస్కర్(Vikram S Kirloskar) మృతి పట్ల దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు భారతీయ వ్యాపారవేత్తలు , ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గొప్ప వ్యాపార వేత్తను, దార్శనికుడిని ఈ దేశం కోల్పోయిందన్నారు.
ఇదిలా ఉండగా ఆయన అత్యున్నత స్థానంలో ఉన్నా సామాన్యుడి లాగే వ్యవహరించారంటూ కంపెనీ పేర్కొంది.
Also Read : ఎయిర్ ఇండియాతో విస్తారా విలీనం