Sonia Gandhi : సోనియా..రాహుల్ కు గ్రాండ్ వెల్ క‌మ్

హైద‌రాబాద్ కు క్యూ క‌ట్టిన నేత‌లు

Sonia Gandhi : హైద‌రాబాద్ – కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ రెండు రోజుల స‌మావేశంతో పాటు ఆదివారం నిర్వ‌హించే భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొనేందుకు ఏఐసీసీ మాజీ చీఫ్ , సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ శ‌నివారం హైద‌రాబాద్ కు చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో పాటు సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి , మాజీ టీపీసీసీ చీఫ్ వి. హ‌నుమంత రావు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు.

Sonia Gandhi Reached Hyderabad

సోనియా గాంధీతో(Sonia Gandhi) పాటు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే , మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ వాద్రా విచ్చేశారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది టీపీసీసీ. ఇప్ప‌టికే ప‌లు క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది ఏఐసీసీ ముందు జాగ్ర‌త్త‌గా.

రాబోయే ఎన్నిక‌ల్లో ఎలాంటి వ్యూహం అనుస‌రించాల‌నే దానిపై విస్తృతంగా సీడ‌బ్ల్యూసీలో చ‌ర్చించ‌నున్నారు. ఈ మేర‌కు కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే ఛాన్స్ ఉంది. మ‌రో వైపు వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారు.

ఇప్ప‌టికే బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు గుడ్ బై చెప్పారు. ఆయ‌న‌తో పాటు బీజేపీ నేత‌లు జిట్టా బాల‌కృష్ణా రెడ్డి, యెన్నం శ్రీ‌నివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్నారు.

Also Read : Vijay Sai Reddy : ఐటీ ఉద్యోగులు కాదు పెయిడ్ ఆర్టిస్టులు

Leave A Reply

Your Email Id will not be published!