Indian Flag : త్రివ‌ర్ణ‌ ప‌తాక‌మా జ‌య‌హో యువ భార‌త‌మా

వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కు అండ‌ర్ -19 ఇండియా

Indian Flag : స‌మున్న‌త భార‌తం యువ భార‌త క్రికెట్ జ‌ట్టు ఆట‌గాళ్ల‌ను చూసి గ‌ర్విస్తోంది. ఓ వైపు సీనియ‌ర్ క్రికెట‌ర్లు ఆట‌పై ఫోక‌స్ పెట్ట‌లేక విజ‌యం కోసం తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న త‌రుణంలో యువ ప్లేయ‌ర్లు స‌త్తా (Indian Flag)చాటారు.

వెస్టిండీస్ వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్ -19 ప్ర‌పంచక‌ప్ మెగా లీగ్ లో అండ‌ర్ -19 భార‌త జ‌ట్టు అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాల‌ను ప్ర‌ద‌ర్శించింది.

ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మ‌రోసారి స‌త్తా చాటి ఏకంగా ఫైన‌ల్ కు చేరింది. టైటిల్ హాట్ ఫెవ‌రేట్ గా ఉన్న యువ ఆస్ట్రేలియా జ‌ట్టుకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది.

ఇప్ప‌టికే ఆ జ‌ట్టును నాలుగు సార్లు మ‌ట్టి క‌రిపించింది దుమ్ము రేపింది. రిచ్ లీగ్ లో భాగంగా జ‌రిగిన ప్ర‌తి మ్యాచ్ లో విజ‌యం సాధించారు మ‌న కుర్రాళ్లు.

విజ‌యం సాధించిన వెంట‌నే వారంతా భార‌త దేశానికి చెందిన జాతీయ ప‌తాకాన్ని (Indian Flag) త‌మ చేతుల్లోకి తీసుకుని ఎగుర వేశారు.

వారంతా జాతీయ గీతాన్ని ఆలాపిస్తూ త‌మ సంతోషాన్ని పంచుకున్నారు.

వెస్టిండీస్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆంటిగ్వాలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఇదే మ‌న‌కు కావాల్సింది.

140 కోట్ల భార‌త దేశానికి తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్నామ‌న్న ఎరుక‌తో వారంతా ఆట‌పై ఫోక‌స్ పెట్టారు.

ప్ర‌త్య‌ర్థుల‌తో త‌ల‌ప‌డ్డారు. విజ‌యమో వీర స్వ‌ర్గ‌మో అన్న రీతిలో ఆడుతూ వ‌చ్చారు.

క‌లిసి క‌ట్టుగా ఆడితే ఎంత‌టి స్థాయిలో ఉన్న జ‌ట్టునైనా స‌రే ఓడించ‌గ‌ల‌మ‌ని నిరూపించారు.

ఈ దేశంలో క్రికెట్ అన్న‌ది ఆట కాదు. అది కోట్లాది మంది శ్వాసించే మ‌తం. అందుకే క్రికెట్ కు అంత క్రేజ్.

ఒకవేళ ఆట‌లో భాగంగా జ‌ట్టు ఓడి పోతే తామే ఓడిపోయామ‌న్నంత బాధ‌కు లోన‌వుతారు.

గెలిస్తే వాళ్ల ఆనందం అంతా ఇంతా కాదు. యువ భార‌త జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ కు కొద్ది అడుగుల దూరంలో ఉన్నారు.

వారు ఆ అరుదైన అద్వితీయ‌మైన క‌ప్ ను సాధించాల‌ని కోరుకుందాం.

మ‌రో చ‌రిత్ర‌కు నాంది ప‌ల‌కాల‌ని ఆశిద్దాం. త్రివ‌ర్ణ ప‌తాకం న‌లుదిశ‌లా ఎగ‌రాల‌ని, యువ భార‌తం ఇలాగే విజ‌యాలు సాధించాల‌ని వేడుకుందాం.

కుర్రాళ్లు మీ ఆట‌కు స‌లాం. మీ స్పూర్తికి మీ నిబ‌ద్ద‌త‌కు జోహార్లు.

Also Read : గాంధీపై ఐదుసార్లు హ‌త్యాయ‌త్నం

Leave A Reply

Your Email Id will not be published!