Trump : అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కాస్తా ఊరట కలిగించే వార్త ఇది. రాజ్యాంగబద్ధ అధికారాలను ఉపయోగించుకుని ట్రంప్ ను ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్షన్ ను కోరుతూ డెమోక్రట్లు చేసిన తీర్మానాన్ని ప్రతినిధుల సభలో రిపబ్లికన్ సభ్యులు అడ్డుకున్నారు. అక్కడి రాజ్యాంగంలోని 25వ సవరణ ద్వారా కేబినెట్లోని మెజారిటీ సభ్యులతో అధ్యక్షుడిని పదవి నుంచి దింపవచ్చు. అయినా అభిశంసన కార్యక్రమం కొనసాగించేందుకే డెమోక్రట్లు ప్రయత్నిస్తున్నారు. కాగానిన్నటి దాకా ఆయనకు అన్ని వైపుల నుంచి వత్తిళ్లు వచ్చాయి. అన్ని దారులు మూసుకు పోయాయి.
చివరకు సోషల్ మీడియా సైతం ఆయనను పక్కన పెట్టేసింది. తాజాగా వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనం శ్వేత సౌధంపై ట్రంప్ తన మద్ధతుదారులను ఉసి గొల్పారు. ఈ సంఘటనలో భవనం అద్దం పగిలి పోయింది. వేలాది మంది దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పడంతో అక్కడి పోలీసులు కాల్పులకు పాల్పడ్డారు. నలుగురు మృతి చెందారు. ట్రంప్ వ్యాఖ్యలు, పోస్టుల వల్లనే ఇంత దారుణం జరిగిందంటూ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టా గ్రాం ట్రంప్ వ్యక్తిగత ఖాతాలను రద్దు చేశాయి.
ఏకంగా ట్విట్టర్ మరో అడుగు ముందుకేసి శాశ్వతంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ట్రంప్ సీరియస్ అయ్యారు. జో బైడన్ ప్రమాణ స్వీకారం దగ్గర పడుతున్న కొద్దీ అమెరికాలో టెన్షన్ నెలకొంది. ట్రంప్ తాను దిగనంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. అమెరికా కాంగ్రెస్ బైడన్ గెలిచినట్లు ప్రకటించింది. వాషింగ్టన్ లో కర్ఫ్యూ విధించారు.
No comment allowed please