TS Govt Womens Awards : తెలంగాణ పుర‌స్కారాల‌కు ఎంపిక

27 మందిని ఎంపిక చేసిన ప్ర‌భుత్వం

TS Govt Womens Awards : ప్ర‌తి ఏటా మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని పుర‌స్కారాలు అంద‌జేస్తోంది రాష్ట్ర ప్ర‌భుత్వం. మార్చి 8న జ‌రిగే కార్య‌క్ర‌మంలో అవార్డుతో పాటు గ్ర‌హీత‌ల‌కు రూ. 1 ల‌క్ష న‌గ‌దు బహుమ‌తి(TS Govt Womens Awards)  కింద అంద‌చేస్తుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మొత్తం ఈ ఏడాది 2023కి సంబంధించి తెలంగాణ పుర‌స్కారాల‌ను 27 మందికి ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఎంపికైన వారికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ప్ర‌భుత్వ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి భార‌తి హోళీకేరి ఈ విష‌యాన్ని తెలిపారు. అంగ‌న్ వాడీ టీచ‌ర్ బానోతు జ్యోతి, భ‌రోసా సెంట‌ర్ కోఆర్డినేట‌ర్ గుండా రాజ‌కుమారి, ఆల్పి కిండ‌న్ జెన్ సామాజిక సేవా విభాగంలో , మీనాక్షి గాడ్డే ముఖ్రా స‌ర్పంచ్ , థియేట‌ర్ ప‌రంగా సుజాత దీక్షిత్ ఎంపిక‌య్యారు.

జ‌ర్న‌లిజం విభాగంలో స్వ‌రూప పొట్ల‌ప్లి, జాన‌ప‌ద సాహిత్యంలో డాక్ట‌ర్ బండారు సుజాత శేఖ‌ర్ , సాహిత్యంలో అరుణ నార‌ద బ‌ట్ల‌, ఆరోగ్య రంగంలో డాక్ట‌ర్ అమూల్య మ‌ల్ల‌న్న , చిత్ర‌క‌ళ‌లో నారా విజ‌య‌ల‌క్ష్మి, షీటీమ్స్ లో రుక్మిణి ఇన్సెప‌క్ట‌ర్ , పోలీస్ శాఖ‌లో డీసీపీ అన‌సూయ‌ను ఎంపిక చేశారు.

వీరితో మౌంటెయిన‌ర్ అన్వితా రెడ్డి, స్పోర్ట్స్ అండ‌ర్ 19 క్రికెట్ లో స‌త్తా చాటిన త్రిష గొంగ‌డి, క్లాసిక‌ల్ డ్యాన్స్ విభాగంలో డాక్ట‌ర్ అనురాధ త‌డ‌క‌మ‌ళ్ల‌, సామాజిక సేవా విభ‌గంలో దంటు క‌క‌న‌దుర్గ‌, డాక్ట‌ర్ మాలతి, వ్యాపార విభాగంలో స‌మంత రెడ్డి, జాన‌ప‌దంలో క‌ర్నె శంక‌ర‌మ్మ‌ను ఎంపికైంది.

ఆద్య క‌ళ‌లో డాక్ట‌ర్ గూడూరు మ‌నోజ , క‌మ్యూనిటీ మొబిలైజేష‌న్ లో సామ‌ళ్ల శ్వేత‌, సూప‌ర్ వైజ‌ర్ జి . నందిని, ఐసీడీఎస్ కు సంబంధించి ర‌జియా సుల్తానా , ఆశా వ‌ర్క‌ర్ కృష్ణ వేణిని ఎంపిక చేసింది ప్ర‌భుత్వం.

Also Read : వేధించిన వాళ్ల‌ను చంపేస్తే త‌ప్పేంటి

Leave A Reply

Your Email Id will not be published!