TSPSC Group 1: గ్రూప్‌-1 పోస్టులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం !

గ్రూప్‌-1 పోస్టులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం !

TSPSC Group 1: గ్రూప్ -1 విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆమోదం పొందిన 503 పోస్టులకు అదనంగా మరో 60 పోస్టులను పెంచుతూ జీవో విడుదల చేసింది. ఆర్థిక, హోం, లేబర్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌, పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌డెవలప్‌మెంట్‌, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లలో వివిధ పోస్టులు కలిపి… మొత్తం 60 పోస్టులను పాత నోటిఫికేషన్‌ కు జత చేస్తూ ప్రత్యేకంగా జీవో విడుదల చేసింది. దీనితో గ్రూప్ -1 మొత్తం పోస్టుల సంఖ్య 563కి చేరింది. అంతేకాదు వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణా నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

TSPSC Group 1 Updates

2022 ఏప్రిల్ లో 503 పోస్టుల భర్తీకు గాను కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్‌-1లో 19 విభాగాలకు చెందిన 503 పోస్టులను ఇంటర్వ్యూలు లేకుండానే భర్తీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. గతేడాది జూన్‌ 11న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించగా… సుమారు 2.32లక్షల మంది హాజరయ్యారు. అయితే పేపర్‌ లీకేజీల వ్యవహారం వెలుగు చూడడంతో… హైకోర్టు ఆదేశాల మేరకు ఈ పరీక్షను రెండు సార్లు రద్దు చేసారు. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం, ఇతరత్రా పరీక్షల వల్ల గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష వాయితా పడుతూ వచ్చింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో 60 పోస్టులను పెంచుతూ కొత్త జీవో విడుదల చేసింది.

Also Read : Nick Vujicic: సీఎం జగన్ పై ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ ప్రశంసలు !

Leave A Reply

Your Email Id will not be published!