Nick Vujicic: సీఎం జగన్ పై ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ ప్రశంసలు !

సీఎం జగన్ పై ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ ప్రశంసలు !

Nick Vujicic: స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తున్న ప్రముఖ మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌… ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంసలు వర్షం కురిపించారు. మంగళవారం ఆంధ్రా యూనివర్సిటీలో యువతను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన… విద్యా రంగంలో సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన మార్పులను అభినందించారు. తన విజన్ తో ప్రభుత్వ బడుల్లో మౌళిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టడం, అమ్మ ఒడి లాంటి పథకాలు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నాయని నిక్‌ వుజిసిక్‌ కితాబిచ్చారు. సీఎం జగన్ తనతో పాటు దేశంలో ఎంతో మంది యువతకి ఇన్ఫిరేషన్ అని అన్నారు.

Nick Vujicic Comment

ఈ సందర్భంగా యువతను ఉద్దేశ్యించి నిక్ వుజిసిక్(Nick Vujicic) మాట్లాడుతూ… యువత తలచుకుంటే ప్రపంచాన్ని మార్చగలరు. మీ విజయాన్ని ఆస్వాదించండి. మీ హార్ట్, మీ మైండ్‌లోకి నెగిటివ్ వాయిస్ రానివ్వకండి. ఎప్పుడూ పాజిటివ్ థాట్స్ తో ఉండండి. మీ కలలను నిజం చేసుకోండి. సహనం అనేది ఒక గొప్ప బలం. ఎన్ని ఓడి దుడుకులు వచ్చినా బలంగా ఉండాలి. ఆశ మాత్రం వదలకూడదు. ఇండియాలో ఇకనుంచి ఐదు భాషలో వీడియో అందిస్తాను అని నిక్ వుజిసిక్ తెలిపారు.

పుట్టుకతోనే చేతులు, కాళ్లు లేకుండా జన్మించిన నిక్‌… తన తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో ఒక్కోమెట్టు ఎక్కారు. తన జన్మకు ఒక లక్ష్యం ఉండాలన్న సంకల్పంతో ఎన్నో అవరోధాలు, అవమానాలు ఎదురైనా చలించకుండా, కాళ్లుచేతుల లేకపోయినా మెక్కవోని దీక్షతో ఈత కొట్టడం, సర్ఫింగ్‌ చేయడం, గోల్ఫ్‌ ఆడటం, నోటిలో పెన్ను పెట్టుకుని రాయడం, కాలి వేళ్లతో టైపింగ్‌ చేయడం వంటి విభిన్న సామర్ధ్యాలను అందిపుచ్చుకున్నారు. ఈ క్రమంలో ఒక మంచి వక్తగా కూడా పేరు తెచ్చుకున్నాడు. నిరాశ, నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్న యువతకు తన జీవితం ఒక స్ఫూర్తి, ప్రేరణ ఇచ్చేలా ముందుకు సాగుతున్నాడు. అన్ని అవయవాలు సక్రమంగా, ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నా క్షణికావేశంతో, చిన్నపాటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువతకు నిక్‌ జీవితం ఒక ప్రేరణగా నిలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది యువతలో నిక్‌ తన ప్రసంగాలతో స్ఫూర్తిని రగిలించి, మనోధైర్యాన్ని నింపుతున్నారు.

Also Read : Red Sandal Smugglers: ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో కానిస్టేబుల్‌ దారుణ హత్య !

Leave A Reply

Your Email Id will not be published!