TSPSC Leak Comment : ‘అందమా’ లీకుల పర్వమా
అందానికి కాదేదీ అనర్హం
TSPSC Leak Comment : ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అత్యున్నతమైన రాజ్యాంగ బద్దమైన సంస్థ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీక్ వ్యవహారం(TSPSC Leak Comment) ఒకింత విస్తు పోయేలా చేసింది.
రెండూ స్కాంలేనని , ఇదంతా కల్వకుంట్ల కాన్ దాన్ నుంచే జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ ప్రకటించారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఇదంతా పక్కన పెడితే ఎంతో కాన్ఫిడెన్షియల్ గా ఉండే వ్యవస్థలోకి ఒక లేడీ ఎలా చేరుకోగలిగింది. ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా , పెద్దల హస్తం ఏమైనా ఉందా అన్న కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇదంతా పక్కన పెడితే గత కొన్ని రోజుల నుండి రేణుక పేరు చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ ఎవరీ రేణుక. ఆమె వెనుక ఉన్న శక్తి ఏమిటి. అంతలా ఏకంగా పరీక్ష పేపర్లను మార్చేలా ఏం మాయ చేసింది.
ఏదైనా మంత్రం ఉందా. లేక ఎర వేసిందా..పోనీ ఆమె అందానికీ ఫిదా అయిన వాళ్లు ఎవరున్నారనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో రోజు రోజుకు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి.
ఇక ఇప్పటి వరకు 9 మందిని పట్టుకున్నారు పోలీసులు. కీలకంగా ఉన్న ప్రవీణ్ మొబైల్ లో అన్నీ అభ్యంతకరమైన చిత్రాలు, వీడియోలు ఉన్నాయనేది ప్రధాన ఆరోపణ. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని , దీనికంతటికి బాధ్యత వహించాల్సింది చైర్మన్ జనార్దన్ రెడ్డి అని, వెంటనే బర్తరఫ్ చేయాలని, కొత్త కమిటీని తిరిగి నియమించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఎన్నో సంఘటనలలో వేసిన సిట్ లు ఎలాంటి నిజాలను వెలుగులోకి తీసుకు రాలేక పోయాయన్న ఆరోపణలు లేక పోలేదు. రేణుక గురుకులంలో హిందీ టీచర్ గా పని చేస్తోంది. ప్రవీణ్ కు ఎలా పరిచయం అయ్యిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆఫీసు గేటు నుంచి లోపలికి అడుగు పెట్టాలంటే ఎన్నో ఇబ్బందులు.
అలాంటిది ఆమె ఎలా లోపలికి వెళ్లగలిగింది అనేది అనుమానం కలిగిస్తోంది. ఇంటి దొంగల వల్లే ఇలా జరిగిందంటూ చిలుక పలుకులు పలికారు చైర్మన్. దాదాపు అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన మొదట చెప్పిన దానికి తర్వాత తీసుకున్న నిర్ణయాలు పొంతన లేకుండా ఉన్నాయి.
సిట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు. ఒక్క రేణుక కోసం మాత్రమే ఇదంతా జరిగిందా..లేక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది తేలాల్సి ఉంది. ఇది ఒక రకంగా మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రవీణ్ , రాజశేఖర్ రెడ్డి, రేణుక, డాక్యా నాయక్ తో పాటు ఇంకొందరు కూడా వెలుగులోకి వచ్చారు.
మొత్తంగా ఏం జరిగిందనేది ఇంకా తేలాలంటే ఇది కూడా గ్యాంగ్ స్టర్ నయీం లాగా అవుతుందని తెలిసిన వారు కామెంట్(TSPSC Leak Comment) చేస్తున్నారు.
Also Read : లీక్ బాధాకరం కొలువులు భర్తీ చేస్తాం