TSRTC Hyderabad Darshan : టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ దర్శన్
నగర వాసులకు ఖుష్ కబర్
TSRTC Hyderabad Darshan : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎలా ఆదాయం పెంచుకోవాలనే దానిపై ఫోకస్ పెట్టింది. ఓ వైపు ఆస్తులను అమ్మకానికి పెడుతూనే ఇంకో వైపు ప్యాకేజీలు స్టార్ట్ చేసింది. ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇందు కోసం హైదరాబాద్ దర్శిని(TSRTC Hyderabad Darshan) అని పేరు పెట్టింది. దీనికి వీకెండ్ బస్ టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. శని, ఆదివారం వారాంతాల్లో హైదరాబాద్ లోని ఏడు ప్రసిద్ధ గమ్యస్థానాలకు వెళ్లడానికి ప్రత్యేక బస్ టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. దీనికి హైదరాబాద్ దర్శిని పేరు పెట్టింది టీఎస్ఆర్టీసీ.
వారాంతపు ప్యాకేజీ నగరంలోని ప్రసిద్ధ ప్రదేశాల చుట్టూ 12 గంటల పాటు ప్రయాణం కొనసాగుతుంది. ఈ కొత్త ప్యాకేజీని విద్యార్థులు, కుటుంబాలు, ప్రకృతి ప్రేమికులు కొత్త ఆఫర్ ను ప్రకటించింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరింది టీఎస్ఆర్టీసీ. సికింద్రాబాద్ లోని ఆల్ఫా హొటల్ దగ్గరి నుంచి ఉదయం 8 గంటలకు బస్సు బయలు దేరి ముందుగా బిర్లా మందిర్ , చౌమహల్లా ప్యాలస్ కు చేరుకుంటుంది.
తారామతి బారాదరి రిసార్ట్ లోని హరిత హోటల్ లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు. అనంతరం పర్యాటకులను గోల్కొండ కోట, దుర్గం చెరువు పార్కుకు చేరవేస్తారు. అనంతరం ప్రసిద్ద కేబుల్ బ్రిడ్జి మీదుగా నెక్లెస్ రోడ్డు, హుస్సేన్ సాగర్ సమీపంలోని ఎన్టీఆర్ పార్కుకు పర్యాటకులను తీసుకు వెళతారు.
12 గంటల రైడ్ తర్వాత ఆల్ఫా హోటల్ వద్దకు తిరిగి వస్తుంది. మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు ఛార్జీ పెద్దలకు రూ. 250, పిల్లలకు రూ. 130 , మెట్రో లగ్జరీ ఏసీ బస్సు చార్జీ పెద్దలకు రూ. 450, పిల్లలకు రూ. 340 వసూలు చేస్తారు. హైదరాబాద్ దర్శన్ సేవ కోసం టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. 040-23450033 లేదా 040-69440000కు కాల్ చేయాలని సూచించింది.
Also Read : వైఎస్సార్-2022 పురస్కార గ్రహీతలు వీరే