Brain Lara & Rahul Dravid : దిగ్గజాల కలయిక జ్ఞాపకాల కలబోత
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో లారా..ద్రవిడ్
Brain Lara & Rahul Dravid : ప్రపంచ క్రికెట్ లో ఆ ఇద్దరు ఆటగాళ్లు ప్రత్యేకమైన వ్యక్తులు. ఒకరు తమ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటే మరొకరు సంప్రదాయ ఆటకు కొత్త వన్నెలు అద్దారు.
ఆ దిగ్గజ క్రికెటర్లు ఎవరో కాదు ఒకరు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా(Brain Lara) మరొకరు ది వాల్ గా పేరొందిన రాహుల్ ద్రవిడ్. ఒకరు కామెంటేటర్ గా బిజీగా ఉంటే మరొకరు భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్నారు.
లారా, ద్రవిడ్ లు ఒకే వేదికపై కలుసు కోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరు భారత్, విండీస్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ సందర్భంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో కలుసుకున్నారు.
1990 నుంచి 2000 దాకా బ్రియన్ లారా(Brain Lara), ద్రవిడ్(Rahul Dravid) పలు సందర్భాలలో వివిధ దేశాలతో జరిగిన జట్లతో ఆడారు. అద్భుతమైన రికార్డులు నమోదు చేశారు. క్రికెటర్ గానే కాకుండా సింప్లిసిటీని ఎక్కువగా ఇష్టపడే ఆటగాళ్లలో లారా, ద్రవిడ్ ఉన్నారు.
ఈ ఇద్దరు ఆటగాళ్లు ఎవరికి వారే ప్రత్యేకం. చాలా సార్లు ఎదురెదురుగా పోటీ పడ్డారు. అద్భుతమైన ఫామ్ తో పరుగుల వరద పారించారు. తమ దేశాల తరపున చిరస్మరణీయమైన విజయాలు అందించారు.
ఆట శాశ్వతమని క్రీడాకారుల మధ్య స్నేహం ఎల్లప్పటికీ నిలిచే ఉంటుందని మరోసారి బ్రియన్ లారా, రాహుల్ ద్రవిడ్ లు నిరూపించారు.
వర్ధమాన క్రికెట్ ప్రపంచంలో ఈ ఇద్దరి నుంచి ఎంతో నేర్చు కోవాల్సింది చాలా ఉందంటున్నారు తాజా, మాజీ ఆటగాళ్లు.
ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఉండేలా చూడడంలో ద్రవిడ్(Rahul Dravid) స్పెషల్ అయితే లారా మాత్రం వెరీ వెరీ స్పెషల్. మిస్టర్ కూల్ గా ఉండేందుకు ట్రై చేస్తుంటాడు. ఈ ఇద్దరి ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read : గెలుపులో సిరాజ్..శాంసన్ హీరోలు