Uday Kotak Resign : కోటక్ మహీంద్రా సిఇఓ రాజీనామా
చేయాల్సిన పనినే నమ్మండి
Uday Kotak Resign : కోటక్ మహీంద్రా గ్రూప్ సిఇఓ పదవికి రాజీనామా చేశారు ఉదయ్ కోటక్. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చేయాల్సిన పనిని నమ్మాలని సూచించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ ప్రకాశ్ ఆప్టేకు లేఖ రాశారు. ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు ఉదయ్ కోటక్.
Uday Kotak Resign His Position
తనకు ఇంకా కొన్ని నెలల పాటు పని చేసేందుకు సమయం ఉన్నప్పటికీ త్వరగానే తప్పు కోవాలని చూస్తున్నట్లు తెలిపారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని ఆయన కోరారు. కోటక్ మహీంద్రా ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో కీలకమైన బ్యాంకుగా పేరు పొందింది. సిఇఓతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి కూడా తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఉదయ్ కోటక్.
తాను కొంత కాలం నుంచీ ఈ నిర్ణయం గురించి ఆలోచిస్తున్నానని, అయితే ఇదే ఇప్పుడు సరైన సమయమని భావిస్తున్నట్లు చెప్పారు. కొటక్ బ్యాంక్ తో నా అనుబంధం గొప్పది. అది మరిచి పోలేనిది కూడా. టాప్ లో ఉండేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశానని తాను నమ్ముతున్నట్లు తెలిపారు.
ఉదయ్ కొటక్(Uday Kotak Resign) తప్పు కోవడంతో ఆయన స్థానంలో సీఈఓ, ఎండీగా తాత్కాలికంగా జాయింట్ ఎండీ దీపక్ గుప్తా పని చేయనున్నారు. వ్యవస్థాపకులు వెళ్లి పోతారు..కానీ కొటక్ మహీంద్రా అలాగే ఉంటుందన్నారు ఉదయ్ కోటక్.
Also Read : Dasoju Sravan : రేవంత్ బీజేపీకి కోవర్టు – దాసోజు