Uddhav Thackeray: శివసేన మేనిఫెస్టో విడుదల చేసిన ఉద్ధవ్ ఠాక్రే !
శివసేన మేనిఫెస్టో విడుదల చేసిన ఉద్ధవ్ ఠాక్రే !
Uddhav Thackeray: శివసేన (యూటీబీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే లోక్సభ ఎన్నికల 2024 కోసం పార్టీ మేనిఫెస్టోను గురువారం విడుదల చేశారు. లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరగటానికి ఒకరోజు ముందు మేనిఫెస్టోను ‘వచన్ నామ’ పేరుతో విడుదల చేశారు. శివసేన పార్టీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా దోపిడిని ఆపడం, ఉపాధి కల్పన, వ్యవసాయ రుణమాఫీ మొదలైనవాటిపైన దృష్టి పెట్టినట్లు మేనిఫెస్టోలో తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉపాది కల్పన, రైతుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, రాష్ట్ర అభివృద్ధి ప్రధానం అంటూ ఉద్ధవ్ ఠాక్రే విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు.
Uddhav Thackeray Manifesto
మేనిఫెస్టో విడుదల సందర్భంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో ఉద్యోగ కల్పన చాలా అవసరం అని పేర్కొన్నారు. తప్పకుండా రాష్ట్రంలో కావలసిన ఉద్యోగాలను ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. ప్రజలు రాష్ట్రాన్ని వదిలి వలస వెళ్లకుండా… జిల్లా స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన అన్నారు.
వ్యవసాయ రుణాలను మాఫీ చేయడమే కాకుండా, పంట భీమాకు సంబంధించిన షరతులను కూడా సవరిస్తామని ఉద్ధవ్ ఠాక్రే మేనిఫెస్టోలో వెల్లడించారు. వ్యవసాయ పరికరాలు, విత్తనాల మీద GST లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. స్వామినాథన్ కమిటీ నివేదిక సిఫార్సు చేసిన కనీస మద్దతు ధర అమలు కూడా జరుగుతుందని ఆయన అన్నారు. పన్ను ఉగ్రవాదాన్ని తగ్గించడానికి, న్యాయపరమైన.. సమన పన్నుల వ్యవస్థను నిర్థారిస్తామని ఠాక్రే అన్నారు.
మహారాష్ట్రలో పర్యావరణ అనుకూల ప్రాజెక్టులు, పరిశ్రమలను మాత్రమే అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని ఎనిమిది లోక్ సభ స్థానాలకు శుక్రవారం (ఏప్రిల్ 26) రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. బుల్దానా, అకోలా, అమరావతి, వార్ధా, యవత్మాల్-వాషిం, హింగోలి, నాందేడ్, పర్భాని ప్రాంతాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రాంతాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 16,589 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు.
Also Read : AP News : ఆ జిల్లా టీడీపీకి మరో పెద్ద షాక్…వైసీపీ కండువా కప్పుకున్న సీనియర్ నేతలు