Uddhav Thackeray : నాందేడ్ శివ‌సేన చీఫ్ పై ఠాక్రే వేటు

ప‌ద‌వి నుంచి తొల‌గిస్తూ చ‌ర్య‌లు

Uddhav Thackeray : మ‌రాఠాలో శివ‌సేన పార్టీ విష‌యంలో నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగుతోంది వ్య‌వ‌హారం. ఇప్ప‌టికే తిరుగుబాటు జెండా ఎగుర వేసి ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చున్న ఏక్ నాథ్ షిండే శివ‌సేన పార్టీ త‌మ‌దేనంటూ కోర్టుకు ఎక్కారు.

ఆపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి గుర్తించాల‌ని కోరుతూ లేఖ రాశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు తొంద‌ర‌ప‌డి నిర్ణ‌యం తీసుకోవ‌ద్దంటూ సీఈసీని ఆదేశించింది.

సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలో ధ‌ర్మాసనం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ త‌రుణంలో బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివ‌సేన పార్టీ త‌మ‌దేనని, ఆయ‌న‌కు వార‌సులం తామేనంటూ ప్ర‌క‌టించారు ఆ పార్టీ చీఫ్‌,

మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే. ఆపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డంతో వివాదం ముదిరి పాకాన ప‌డింది. తాజాగా మ‌హారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ప‌ర్య‌ట‌న‌కు ముందు ఠాక్రే నాందేడ్ శివ‌సేన పార్టీ చీఫ్ ను తొల‌గించారు.

కోలుకోలేని షాక్ ఇచ్చారు. సోమ‌వారం ముఖ్య‌మంత్రి నాందేడ్ లో అధికారికంగా ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ముంద‌స్తుగా ప్ర‌క‌టించింది.

పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డినందుకు శివ‌సేన పార్టీ నాందేడ్ జిల్లా చీఫ్ ఉమేష్ ముండేపై వేటు వేశారు ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray). ఈ విష‌యాన్ని శివ‌సేన పార్టీ కార్య‌ద‌ర్శి వినాయ‌క్ రౌత్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

మిస్ట‌ర్ షిండే , 39 మంది ఇత‌ర శివ‌సేన ఎమ్మెల్యేలు పార్టీ నాయ‌క‌త్వానికి వ్య‌తిరేకంగా తిరుగుబాటు చేశారు. ఠాక్రే నేతృత్వంలోని మ‌హా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్ర‌భుత్వం ప‌త‌నానికి దారితీసింది.

Also Read : ప‌ని చేస్తే ఓకే లేక పోతే తొల‌గింపే

Leave A Reply

Your Email Id will not be published!