Akshatha Murthy Loss : అక్ష‌తా మూర్తికి రూ. 500 కోట్ల న‌ష్టం

పీఎం రిషి సున‌క్ భార్య‌

Akshatha Murthy Loss : యూకే ప్ర‌ధాన మంత్రి రిషి సున‌క్ భార్య అక్ష‌తా మూర్తికి కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆమె ఒక్క రోజు లోనే రూ. 500 కోట్లు కోల్పోయారు. ఇన్ఫోసిస్ చైర్మ‌న్ నారాయ‌ణ మూర్తి, భార్య సుధా మూర్తి కూతురే అక్షతా మూర్తి(Akshatha Murthy Loss) . ఆమె ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలో 0.94 శాతం వాటాను క‌లిగి ఉన్నారు. $49 మిలియ‌న్లు దాదాపు భార‌తీయ రూపాయ‌ల్లో 500 కోట్ల‌కు పైగా న‌ష్టం వాటిల్లింది. క‌రోనా త‌ర్వాత ఇన్ఫోసిస్ షేరు ధ‌ర దాదాపు 11 శాతం ప‌డి పోయింది.

కంపెనీకి సంబంధించి 9.4 శాతం ప‌డి పోయింది. ఇది మార్చి 2020 త‌ర్వాత అతి పెద్ద ప‌త‌నం పొంద‌డం కావ‌డం విశేషం. సునాక్ కుటుంబ సంప‌ద‌లో కొంత భాగం అయిన‌ప్ప‌టికీ మూర్తి వాటా ఇప్ప‌టికీ $450 మిలియ‌న్ల కంటే ఎక్కువ‌గా ఉంది. దీనిపై సున‌క్ కార్యాల‌యం వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది.

గ‌త ఏడాది ఆమె తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంది. నివాసేత‌ర హొదాను క‌లిగి ఉంద‌ని , విదేశీ ఆదాయాల‌పై యుకె ప‌న్ను చెల్లించ లేద‌ని తేలింది. త‌న ఏర్పాట్లు పూర్తిగా చ‌ట్ట బ‌ద్ద‌మైన‌వ‌ని పేర్కొంది. ఈ సంపాద‌న‌పై ప‌న్నులు చెల్లించ‌డం ప్రారంభించార‌ని తెలిపింది.

ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన‌మంత్రి గ‌త నెల‌లో త‌న స్వంత ఆర్థిక వ్య‌వ‌హారాల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. గ‌త మూడేళ్ల‌లో యూకే ప‌న్నుల్లో $1 మిలియ‌న్ కంటే ఎక్కువ చెల్లించిన‌ట్లు తెలిపాడు.

Also Read : జీతాలు పెంచిన ఎయిర్ ఇండియా

Leave A Reply

Your Email Id will not be published!