Ukraine USA : అదిగో పులి ఇదిగో ఆవు అన్న కథ గుర్తుకు వచ్చేలా ఉంది. అగ్ర రాజ్యానికి ఎవరు చీఫ్ గా వచ్చినా ఆ దేశం తన కుఠిల రాజనీతిని మార్చు కోవడం లేదు. ప్రపంచంపై పట్టు సాధించాలన్న ఆలోచన చివరకు అభాసు పాలయ్యే దాకా వెళుతోంది.
జోసెఫ్ బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ పార్టీ వర్గాలనే కాదు దేశ ప్రజలను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. విదేశాంగ విధానంపై ఈరోజు వరకు ఏ ఒక్క నిర్ణయం అమెరికాకు మద్దతుగా రాలేదు.
ఇక ఆఫ్గనిస్తాన్ లో సైనికులను వెనక్కి పిలవడం కూడా బైడెన్ (Ukraine USA)పరాజయానికి పరాకాష్టగా చెప్పక తప్పదు.
తాజాగా రష్యాపై రంకెలేసిన బైడెన్ చివరకు చర్చిద్దాం అని రాయబారం పంపారు.
పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటుండగా తాను కన్నెర్ర చేస్తే ప్రపంచం దాసోహం కావాలని అనుకుంటోంది చైనా.
ఇక భారత్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది.
మనం శాంతి మంత్రం జపిస్తూ ఉండగానే డ్రాగన్ వాస్తవాధీన రేఖను దాటుతోంది.
దేశంలో మతం పేరుతో రాజకీయం చేయడం తప్పించి ఇంకే పనీ చేయడం లేదు మోదీజీ.
ఇప్పటికే సగం దేశాన్ని బడా పారిశ్రామికవేత్తలకు అప్పనంగా అప్పగించేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.
ఇక పదే పదే రష్యా దాడి చేయబోతోందంటూ బైడెన్ (Ukraine USA)ప్రకటించడాన్ని ఉక్రెయిన్ చీఫ్ వోల్టోమిర్ జెలెనోస్కీ తీవ్ర అభ్యంతరం తెలిపాడు.
చేతనైతే సాయం చేయండి . లేదంటే మౌనంగా ఉండండి అంటూ మండిపడ్డాడు.
తమ నేలను కాపాడుకునే సత్తా తమకు ఉందంటూ ఇప్పటికే డిక్లేర్ చేశాడు.
గజం భూమి కూడా వదులు కోమని వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
అమెరికా ఉక్రెయిన్ పై తేదీల వారీగా రష్యా దాడి జరప వచ్చంటూ హల్ చల్ చేసింది.
దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపాడు ఉక్రెయిన్ చీఫ్. బైడెన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పశ్చిమ దేశాలతో చేతులు కలిపాడు జెలెన్ స్కీ.
సాయం చేయాలని ఉంటే చేయండి లేదంటే ప్రకటనలు ఆపేయండి అంటూ స్పష్టం చేశాడు.
రష్యాపై ఆంక్షలు విధించండి. మీ నిజాయితీని నిరూపించు కోవాలని స్పష్టం చేశాడు. దీంతో ఉన్న పరువు పోయింది అమెరికాకు.
Also Read : ఆ గాత్రం దిగంతాల్ని వెలిగించే ధూపం