గణేష్ నిమజ్జనం కోసం నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రా

ప్ర‌క‌టించిన టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ పాటిల్

హైద‌రాబాద్ : ట్యాంక్ బండ్ వద్ద విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేసింది టీజీఎస్‌పీడీసీఎల్ . గ‌ణేశ్ నిమజ్జన ఉత్సవం సందర్భంగా నిరంతరాయ విద్యుత్ సరఫరాను నిర్ధారించడానికి టీజీఎస్‌పీడీసీఎల్ ప్రత్యేకంగా 32 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లను (డీటీఆర్‌లను) ఏర్పాటు చేసింది. శుక్రవారం జరగనున్న మహా గణేష్ నిమజ్జనం దృష్ట్యా తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్‌పీడీసీఎల్) హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో దాని చుట్టుపక్కల నిరంతరాయ, సురక్షిత విద్యుత్ సరఫరాను నిర్ధారించడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లలో భాగంగా ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీజీఎస్‌పీడీసీఎల్ క్యాంప్ కార్యాలయాన్ని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం సీఎండీ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ , నిమజ్జన ఘాట్‌ల వద్ద విద్యుత్ సరఫరా ఏర్పాట్లు, భద్రతా చర్యలు , అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను తనిఖీ చేసి, అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేశారు.

నిమజ్జన ఉత్సవం సందర్భంగా నిరంతరాయ విద్యుత్ సరఫరాను నిర్ధారించడానికి టీజీఎస్‌పీడీసీఎల్ ప్రత్యేకంగా 32 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లను (డీటీఆర్‌లు) ఏర్పాటు చేసింది. వీటిలో 23 500 kVA డీటీఆర్‌లు, ఎనిమిది 160 kVA డీటీఆర్‌లు , ఒక 1000 kVA డీటీఆర్ ఉన్నాయి. అంతే కాకుండా విద్యుత్ సరఫరా విశ్వసనీయతను పెంచడానికి, అరడజను సబ్‌స్టేషన్ల నుండి తీసుకున్న 19 ప్రత్యేక 11 kV ఫీడర్‌లను ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లుగా సిద్ధంగా ఉంచారు. ఏదైనా అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించడానికి వీలుగా ఒక రింగ్ వ్యవస్థను అమలు చేశారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం రాష్ట్రంలో జరిగే అతిపెద్ద బహిరంగ కార్యక్రమాలలో ఒకటి, దీనికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఇంతటి భారీ కార్యక్రమం సమయంలో నిరంతరాయ విద్యుత్ సరఫరాను నిర్ధారించడం అత్యంత ముఖ్యం అన్నారు. అందుకని తాము అదనపు డీటీఆర్‌లు, ప్రత్యామ్నాయ ఫీడర్‌లు, ప్రత్యేక సిబ్బంది, అత్యవసర ప్రతిస్పందన బృందాలను మోహరించడం ద్వారా ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు సీఎండీ.

Leave A Reply

Your Email Id will not be published!