Union Budget 2023 Sports : క్రీడా రంగానికి రూ. 3,397 కోట్లు

బ‌డ్జెట్ లో భారీగా కేటాయింపు

Union Budget 2023 Sports : పార్ల‌మెంట్ లో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో క్రీడా రంగానికి ఈసారి పెద్ద పీట వేసింది. గ‌త ఏడాది కంటే ఈసారి బ‌డ్జెట్ లో స్పోర్ట్స్ కు ఎక్కువ ప్ర‌యారిటీ ఇచ్చింది. ఇటీవ‌ల భార‌త క్రీడా రంగం కొత్త పుంత‌లు తొక్కుతోంది. అన్ని క్రీడా విభాగాలలో మ‌న క్రీడాకారులు అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దేశానికి పేరు తీసుకు వ‌స్తున్నారు.

ఈసారి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌త్యేకించి స్పోర్ట్స్ కోటాపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది. 2023 -2024 సంవ‌త్స‌రానికి గాను క్రీడా రంగానికి ఏకంగా రూ. 3,397.32 కోట్లు కేటాయించింది. ఇది స్పోర్ట్స్ రంగానికి ఊతం ఇచ్చేలా అవుతుంద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. గ‌త ఏడాది 2022-2023 సంవ‌త్స‌రానికి గాను కేంద్ర బ‌డ్జెట్ లో కేవ‌లం 3,062 కోట్లు(Union Budget 2023 Sports) కేటాయించింది.

ఈ సారి బ‌డ్జెట్ ను పెంచింది. 723.97 కోట్లు అద‌నంగా పెంచింది. ఇక ప్ర‌తి సంవ‌త్స‌రం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తూ వ‌స్తోంది ఖేలో ఇండియా. ఇది స్పెష‌ల్ ప‌థ‌కం. దీని కింద దేశంలోని క్రీడా రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌డం. క్రీడాభివృద్దికి ఇతోధికంగా పాటు ప‌డ‌టం దీని ల‌క్ష్యం. ఖేలో ఇండియాకు ఈసారి కేంద్ర బ‌డ్జెట్ లో రూ. 439 కోట్లు అద‌నంగా పెంచింది.

దీంతో రూ. 1,045 కోట్ల‌కు చేరుకుంంది. ఇక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్ )కి కూడా బ‌డ్జెట్ ను పెంచింది. అద‌నంగా రూ. 36 కోట్లు పెంచ‌డంతో దాని బ‌డ్జెట్ రూ. 785 కోట్ల‌కు చేరుకుంది. అంతే కాకుండా స్పోర్ట్స్ కేట‌గిరీ కింద నేష‌న‌ల్ స్పోర్ట్స్ ఫెడ‌రేష‌న్ కు రూ. 325 కోట్లు కేటాయించింది. నేష‌న‌ల్ యాంటీ ఏజెన్సీకి రూ. 21.73 కోట్లు కేటాయించింది కేంద్ర స‌ర్కార్.

Also Read : ప్ర‌జ‌లంద‌రికీ అనువైన బ‌డ్జెట్ – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!