Akhilesh Yadav : యూపీ సర్కార్ అవినీతికి పరాకాష్ట
బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే రహదారి
Akhilesh Yadav : సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈనెల 16న ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు బుందెల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ నాలుగు లేన్ల రహదారిని.
296 కిలోమీటర్ల రోడ్డును రూ. 15, 000 కోట్ల ఖర్చుతో నిర్మించారు. తాజాగా పెద్ద ఎత్తున కురిసిన వర్షాలకు పలు చోట్ల నాలుగు లేన్ల రహదారులు పగుళ్లు పారాయి. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav).
కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని రోడ్డు పాలు చేశారంటూ ధ్వజమెత్తారు. ఎవరి ప్రయోజనాల కోసం దీనిని నిర్మించారంటూ ప్రశ్నించారు.
పొద్దస్తమానం అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న సీఎం యోగి, పీఎం మోదీ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అఖిలేష్ యాదవ్.
తాజా పరిణామానికి సంబంధించిన తాజా శిథిలాలు ఇవేనంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేలో ఈ పగుళ్లు బీజేపీ అవినీతి, అక్రమాలకు పరాకాష్ట అని మండిపడ్డారు.
ప్రజలను విద్వేష పూరిత రాజకీయాలలోకి నెట్టి వేసి ఇలాంటి చౌకబారు పనులకు పాల్పడుతున్న వారిని ఏమనాలంటూ ప్రశ్నించారు అఖిలేష్ యాదవ్.
ఇందుకు కారణం ఎవరు. ప్రాజెక్టు హెడ్, కాంట్రాక్టర్లు, కంపెనీలు, ఇతరులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రహదారులు పగుళ్లు పారడంపై స్వంతంగా సీఎం యోగి ఆదిత్యానాథ్ వివరణ ఇవ్వాలన్నారు సమాజ్ వాది పార్టీ చీఫ్.
ఇప్పటికైనా బీజేపీ చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు అఖిలేష్ యాదవ్.
Also Read : అవగాహన లేని చర్చలు హానికరం – సీజేఐ
ये हैं भाजपा के तथाकथित नवीनतम विकास के नवीनतम खंडहर! बुंदेलखंड एक्सप्रेस-वे की ये जो दरार है दरअसल ये भाजपा का भ्रष्टाचार है। जनता को नफ़रत की राजनीति में झोंक कर विकास के नाम पर आटे तक पर वसूले जा रहे पैसों से क्या ऐसा ही विकास होगा।
कारवाँ ठहर गया… वो सरकारें तोड़ते रहे… pic.twitter.com/6lhMmBcZVv
— Akhilesh Yadav (@yadavakhilesh) July 22, 2022