Case File Mitchell Marsh : మార్ష్ పై యూపీ పోలీస్ కేసు
వరల్డ్ కప్ ను అవమానించాడని
Case File Mitchell Marsh : ఉత్తర ప్రదేశ్ – ఐసీసీ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆసిస్ జట్టులో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ మిచెల్ మార్ష్ కు కోలుకోలేని షాక్ తగిలింది. డబ్ల్యూసీ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. భారీ తేడాతో భారత జట్టును ఓడించి విశ్వ విజేతగా నిలిచింది ఆసిస్.
Case File Mitchell Marsh Viral
డ్రెస్సింగ్ రూమ్ లో ఐసీసీ ప్రపంచ కప్ పై కాళ్లు వేసి ఉంచిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దమని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో సోసల్ మీడియాలో ఆగ్రహం చోటు చేసుకుంది. తాజాగా శుక్రవారం భారత క్రికెట్ జట్టు అభిమానుల మనో భావాలను కించ పరిచారని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్త పండిట్ కేశవ్ ఫిర్యాదు చేశారు.
దీంతో యూపీ పోలీసులు ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు కూడా తెలియ చేయడం జరిగిందని , తదుపరి చర్యలకు తను రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం మార్ష్ ఏ విధంగా ఈ కేసును ఎదుర్కొంటారనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
Also Read : Bhatti Vikramarka : సంపదను దోచుకున్న దొర కేసీఆర్