UPW vs GG WPL 2023 : యూపీ వారియ‌ర్స్ అదుర్స్

ప్లే ఆఫ్స్ కు ద‌ర్జాగా

UPW vs GG WPL 2023 : బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో తొలిసారి నిర్వ‌హిస్తున్న మ‌హిళ‌ల ప్రిమీయ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్) లో అనూహ్యంగా యూపీ వారియ‌ర్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.

ఇప్ప‌టికే పాయింట్ల పట్టిక‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ , ముంబై ఇండియ‌న్స్ టాప్ లో ఉండ‌గా వాటికి జ‌త‌గా యూపీ వారియ‌ర్స్ కూడా చేరింది.  టోర్నీలో భాగంగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో యూపీ వారియ‌ర్స్ 3 వికెట్ల తేడాతో గుజ‌రాత్ జెయింట్స్(UPW vs GG WPL 2023) పై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. 

ఢిల్లీ క్యాపిట‌ల్స్ 5 మ్యాచ్ ల‌లో గెలుపొందితే ముంబై ఇండియ‌న్స్ కూడా అన్ని మ్యాచ్ లు నెగ్గి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖ‌రారు చేసుకున్నాయి. ఇరు జ‌ట్లు 10 పాయింట్ల‌తో టాప్ లో నిలిచాయి. ఇక బెంగ‌ళూరు ఏడు మ్యాచ్ లు ఆడింది 5 మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది. రెండింట్లో నెగ్గింది. 

ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆరింట్లో ఓడి పోయి జాబితాలో ఆఖ‌రున నిలిచింది. మ్యాచ్ విష‌యానికి వ‌స్తే మొద‌ట బ్యాటింగ్ చేసింది గుజ‌రాత్ జెయింట్స్ . నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 178 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. 

గార్డ్ న‌ర్ 39 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో చెల‌రేగింది. 60 ర‌న్స్ చేసింది. హేమ‌ల‌త 33 బాల్స్ ఎదుర్కొంది. 6 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 57 ర‌న్స్ చేసింది. అనంత‌రం భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన యూపీ వారియ‌ర్స్ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. 

ఇంకా ఒక బంతి మిగిలి ఉండ‌గానే గెలుపు జెండా ఎగుర వేసింది. 7 వికెట్లు కోల్పోయి 181 ర‌న్స్ చేసింది. గ్రేస్ హారిస్ చుక్క‌లు చూపించింది. 41 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో 72 ప‌రుగులు చేసింది. త‌హిలా మెక్ గ్రాత్ 38 బంతులు ఎదుర్కొని 11 ఫోర్ల‌తో 57 ర‌న్స్ చేసింది. ఇక డ‌బ్ల్యూపీఎల్ నుండి గుజ‌రాత్ , బెంగ‌ళూరు టోర్నీ నుంచి త‌ప్పుకున్నాయి.

Also Read : ముంబై ఇండియ‌న్స్ కు ఢిల్లీ బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!