US Black List : చైనా కంపెనీలకు షాక్ యుఎస్ ఝలక్
36 సంస్థలకు కోలుకోలేని దెబ్బ
US Black List : అమెరికా కోలుకోలేని షాక్ ఇచ్చింది చైనాకు. ఏకంగా 36 కంపెనీలు అత్యంత ప్రమాదకరంగా గుర్తించినట్లు పేర్కొంది. ఇందులో భాగంగా జాతీయ భద్రత, ప్రయోజనాలు , మానవ హక్కులకు ఈ కంపెనీల కారణంగా ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందంటూ స్పష్టం చేసింది.
ఈ మేరకు అమెరికా వాణిజ్య శాఖ చైనాతో ఎక్స్ పోర్ట్స్ , ఇంపోర్ట్స్ ని నిలిపి వేస్తూ నిర్ణయం తీసుకుంది. విడుదల చేసిన జాబితాలో నిలుపుదల చేసిన మొత్తం 36 చైనాకు చెందిన కంపెనీలు ఉన్నాయి.
నిషేధానికి గురైన కంపెనీలలో ప్రధానంగా విమాన విడి భాగాలు, రసాయనాలు, కంప్యూటర్ లలో ఉపయోగించే చిప్ తయారీ కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి. తాత్కాలికంగా వీటి కార్యకలాపాలు నిలిపి వేస్తున్నట్లు పేర్కొంది అమెరికా(US Black List). ఇప్పటికే అమెరికాలో చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ హువావేను నిషేధించారు. ఇదే కంపెనీకి సంబంధించి అనుబంధంగా ఉన్న యాంగ్ జీ మెమరీ టెక్నాలజీస్ , హెఫ్ కోర్ స్టోర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు కూడా ఝలక్ ఇచ్చింది.
మరో వైపు చైనా, అమెరికా దేశాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ప్రధానంగా తైవాన్ విషయంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరిగాయి. ఇక్కడ నువ్వా నేనా అన్నంతగా మారింది. ఇదే సమయంలో వైమానిక దళాలను కూడా మోహరించింది చైనా.
జిన్ పింగ్ మరోసారి చైనాకు చీఫ్ గా ఎన్నికయ్యాక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కారణంగా ఆయా కంపెనీల కార్యకలాపాలపై ఎక్కువ ప్రభావం పడుతోంది.
Also Read : ప్రధాని మోదీ వైఖరి ప్రశంసనీయం – యుఎస్