US VISA Time Reduce : వీసాల జారీపై యుఎస్ ఫోకస్
సమయాన్ని తగ్గించేందుకు చొరవ
US VISA Time Reduce : అమెరికా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత దేశంలో వీసా ప్రాసెసింగ్ లో కొనసాగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే వేలాది దరఖాస్తులు నిలిచి పోయాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి నేటి దాకా వీసాల జారీలో ఆలస్యం జరుగుతోంది. ఇక నుంచి రాబోయే నెలల్లో ఎంపిక చేసిన శనివారాల్లో అపాయింట్మెంట్ల కోసం అదనపు స్లాట్ లను తెరుస్తామని స్పష్టం చేసింది.
ఇక నుంచి వీసా ప్రాసెసింగ్ లో జాప్యాన్ని(US VISA Time Reduce) నివారించేందుకు మొదటిసారి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రత్యేక ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడం, కాన్సులర్ సిబ్బందిని పెంచడం వంటి చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని యుఎస్ రాయబార కార్యాలయం, ముంబై, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్ లోని కాన్సులేట్ లు జనవరి 21న ప్రత్యేకంగా ఇంటర్వూలు చేపట్టినట్లు యుఎస్ ఎంబసీ వెల్లడించింది.
దీనివల్ల వీసాల జారీ ప్రక్రియ, ఇంటర్వ్యూలకు తేదీని ముందే ఖరారు చేయడం, అదనపు సిబ్బందిని నియమించడంపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలిపింది. జనవరి నుంచి మార్చి మధ్య వీసా ప్రాససింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు వాషింగ్టన్ , ఇతర రాయబార కార్యాలయం నుండి పెద్ద ఎత్తున సిబ్బంది ఇక్కడికి వస్తున్నట్లు ఎంబసీ పేర్కొంది.
ఇక భారత దేశంలోని యుఎస్ మిషన్ 2,50,000 అదనపు బీ1, బీ2 అపాయింట్మెంట్లను విడుదల చేసింది. బీ1 వ్యాపార వీసా కాగా బీ2 టూరిజం వీసా. ఇదిలా ఉండగా రికార్డు స్థాయిలో విద్యార్థి, ఉద్యోగ వీసాలు ఉన్నాయని అమెరికా కాన్సులేట్ వెల్లడించింది.
Also Read : అద్భుత అవకాశం కొలువుల మేళం