Cristiano Ronaldo : ఫుట్ బాల్ దిగ్గజానికి భారీ ఊరట
అత్యాచార యత్నం కేసు కొట్టివేత
Cristiano Ronaldo : యావత్ ప్రపంచంలో మోస్ట్ పాపులర్ క్రీడాకారులలో ఒకడిగా పేరొందాడు క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo). అతడు ఎక్కడికి వెళ్లినా వేలాది జనం వెంట వస్తారు. అతడి మ్యాచ్ చూసేందుకు పడి చస్తారు.
ఇంతలా ఈ మధ్య కాలంలో మెస్మరైజ్ చేస్తున్న ఏకైక ఫుట్ బాల్ ఆటగాడు రొనాల్డో ఒక్కడే. సామాజిక మాధ్యమాలలో మనోడికి లెక్కించ లేనంత మంది అభిమాన గణం ఉంది.
ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఫుట్ బాలర్ కూడా రొనాల్డోనే కావడం విశేషం. 30 ఏళ్ల వయస్సు ఉన్నా యువ ఆటగాళ్లతో పోటీపడి గోల్స్ గా మల్చడంలో తనకు తానే సాటి అనే రీతిలో ఆడుతూ ఔరా అనిపిస్తున్నాడు.
ఇక తన కెరీర్ పరంగా ఇప్పటి దాకా టాప్ లో ఉంటూ వచ్చాడు. చాలా జాగ్రత్తగా ఆడుతూ ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా, వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేశాడు.
కానీ రొనాల్డోకు వ్యక్తిగత జీవితంలో ఓ సమస్య ను ఎదుర్కొంటూ వచ్చాడు. అదేమిటంటే 2009లో లాస్ వెగాస్ లోని ఒక హోటల్ లో తనపై రొనాల్డో అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కేత్రిన్ అనే మహిళ కోర్టును ఆశ్రయించింది.
ఎంత గొప్ప వ్యక్తి అయినా అమెరికాలో కోర్టులంటే జడుసు కోవాల్సిందే. అక్కడ చట్టం బలంగా ఉంటుంది. దీంతో యావత్ ప్రపంచం రొనాల్డో(Cristiano Ronaldo) గురించి ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనన్న ఉత్కంఠకు లోనైంది.
ఈ మేరకు కొన్నేళ్లుగా కోర్టులో విచారణ జరిగింది. బాధితురాలి తరపున సరైన ఆధారాలు సమర్పించక పోవడంతో ఈ కేసును కొట్టి వేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. దీంతో రొనాల్డో ఊపిరి పీల్చుకున్నాడు.
Also Read : ఐపీఎల్ కు భారీ ఆదాయం పక్కా – గంగూలీ