హైదరాబాద్ : సౌత్ ఇండియన్ టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్, వెర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై, బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర జంటపై చిత్రీకరించిన బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ ప్రేమ ఓ ప్రేమ అనే పల్లవితో మొదలైన ప్రేమ గీతాన్ని సీనియర్ జర్నలిస్టు ప్రభు లాంచ్ చేశారు. ఈ పాట అన్విక ఆడియోస్ ద్వారా రిలీజ్ అయింది. ఈ పాటకు సంగీతం సుధాకర్ మారియో సమకూర్చారు. ఈ పాట యూత్‌కు బాగా నచ్చుతుందని, ట్రెండింగ్‌గా నిలిచి పోతుందని, సూపర్ హిట్ లవ్ సాంగ్స్‌ల్లో ఈ పాట కూడా చోటు దక్కించు కుంటుందని దర్శకుడు సంజీవ్ మేగోటి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. హారర్ థ్రిల్లర్, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కించినట్టు తెలిపారు.
యాక్షన్, కామెడీ, రొమాన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, రవిశంకర్, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు నటిస్తున్నారు. దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్–రవితేజ ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయని తెలిపారు దర్శకుడు . వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది పాత్రలు వారి గత చిత్రాలకు భిన్నంగా ఉంటాయని తెలిపారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
