30న వెంక‌టేష్ ‘ఆద‌ర్శ కుటుంబం’ రిలీజ్

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన నిర్మాత నాగ‌వంశీ

హైద‌రాబాద్ : మాట‌ల మాంత్రికుడు, టాప్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ఆద‌ర్శ కుటుంబం. నువ్వు నాకు న‌చ్చావ్ తో మాట‌ల ర‌చ‌యిత‌గా త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన చాలా గ్యాప్ త‌ర్వాత త‌న ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్ కీ రోల్ పోషిస్తుండ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. పంచులు, ప్రాస‌ల‌కు పెట్టింది పేరు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. కేవ‌లం ఆయ‌న రాసే మాట‌ల కోస‌మే సినిమాలు చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు సినీ రంగంలో. దీంతో రోజు రోజుకు మ‌రింత ఉత్సుకత‌ను రేపుతోంది ఈ చిత్రం. ఇందులో హీరోయిన్ గా శ్రీ‌నిధి శెట్టి న‌టిస్తోంది. అక్టోబ‌ర్ 9వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్ష‌న్ వ‌ర్క్ లో ఆల‌స్యం కావ‌డంతో సినిమా రిలీజ్ డేట్ ప‌దే ప‌దే వాయిదా వేస్తూ వ‌చ్చారు నిర్మాత నాగ‌వంశీ.

ఈ త‌రుణంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. కీల‌క అప్ డేట్ ఇచ్చారు మూవీ గురించి చిత్ర బృందం. ఈ మేర‌కు అక్టోబ‌ర్ 30వ తేదీన ఆద‌ర్శ కుటుంబం చిత్రాన్ని ప‌క్కాగా విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. మ‌రో వైపు వెంక‌టేష్ ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లోని ఊటీలో అనిల్ రావిపూడి జ‌న‌వ‌రి 12 విడుద‌ల మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇందులో క‌ళ్యాణ్ రామ్ తో పాటు కీర్తి సురేష్, శ్రీ‌నిధి శెట్టి, వెంక‌టేష్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. వ‌చ్చే ఏడ‌ది సంక్రాంతి పండుగ రోజు విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ త‌రుణంలో ఆ సినిమా కంటే ముందే ఈ సినిమా రిలీజ్ కావాల‌ని కోరుకుంటున్నారు విక్ట‌రీ వెంక‌టేష్. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ కీ రోల్ పోషించిన జైల‌ర్ -2 చిత్రం తెలుగు హ‌క్కుల‌ను కొనుగోలు చేశారు నిర్మాత నాగ‌వంశీ. ఈ సినిమా బిగ్ స‌క్సెస్ కావ‌డంతో ఫుల్ జోష్ లో ఉన్నారు . ఈ సంద‌ర్బంగా ఆద‌ర్శ కుటుంబం విడుద‌ల చేసేందుకు రెడీగా ఉన్నామ‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!