Vice President Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్ కు అస్వస్థత ఎయిమ్స్ లో పరామర్శించిన ప్రధాని మోదీ
ఉపరాష్ట్రపతి జగదీప్ కు అస్వస్థత ఎయిమ్స్ లో పరామర్శించిన ప్రధాని మోదీ
Jagdeep Dhankhar : భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆయన్ను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు. ఆసుపత్రి వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం… ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆదివారం తెల్లవారుజామున ఆయనకు ఛాతి నొప్పితో బాధపడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనితో తెల్లవారుజామున 2 గంటలకు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎయిమ్స్‌లోని క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)లో ఉంచి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యబృందం తెలిపింది. ఇక, ధన్కర్ అస్వస్థత విషయం తెలిసిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా… ఎయిమ్స్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు.
Jagdeep Dhankhar – ఎయిమ్స్ కు ప్రధాని మోదీ… జగదీప్ ఆరోగ్యంపై ఆరా
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్యంగా ఉండాలని… త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Also Read : Former Minister Raja Bhaiya: మాజీ మంత్రి రాజా భయ్యాపై గృహ హింస కేసు నమోదు