Vijay Devarakonda : అభివృద్దికి ఓటు వేశా
విజయ్ దేవరకొండ
Vijay Devarakonda : హైదరాబాద్ – నటుడు విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ డే సందర్బంగా గురువారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మీడియాతో మాట్లాడారు. తాను అభివృద్దిని చూసి ఓటు వేశానని చెప్పారు. అంటే తను బీఆర్ఎస్ పార్టీకి వేసినట్లు పరోక్షంగా స్పష్టం చేశారు.
Vijay Devarakonda Comments viral
ఆయన ముందు నుంచీ బీఆర్ఎస్ వైపు ఉన్నారు. తాను నటించిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ కు బీఆర్ఎస్ కు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బినామీగా ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇది పక్కన పెడితే సినీ రంగానికి చెందిన సినీ నటీ నటులు, దర్శకులు, నిర్మాతలు ఓటు వేశారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ , అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్ , నాని, నితిన్ , హరీశ్ శంకర్ , సింగర్ సునీత, తమ్మారెడ్డి భరద్వాజ, శేఖర్ కమ్ముల ఓట్లు వేశారు.
జూబ్లీ హిల్స్ నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ పోటీ చేస్తున్నారు. మొత్తంగా ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : Srikantha Chary : శ్రీకాంతా చారి ఆత్మ శాంతిస్తుంది