Vijay Mallya : విజయ్ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష
ధిక్కార నేరం కింద సుప్రీంకోర్టు
Vijay Mallya : ధిక్కార నేరం కింద బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యాకు(Vijay Mallya) షాక్ తగిలింది. ధిక్కార నేరం కింద మాల్యాకు సుప్రీంకోర్టు 4 నెలల జైలు శిక్ష విధించింది.
విజయ్ మాల్యా పనికిరాని తన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు సంబంధించిన రూ. 9,000 కోట్లకు పైగా బ్యాంక్ లోన్ డిఫాల్ట్ కేసులో నిందితుడు. 2017లో కోర్టు ధిక్కరణ కేసులో పరారీలో ఉన్నాడు ఈ మద్యం వ్యాపారి.
నాలుగు నెలల శిక్షతో పాటు రూ. 2,000 జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే కాకుండా తన పిల్లలకు రూ. 40 మిలియన్ డాలర్లు బదిలీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది కోర్టు.
ఇది పూర్తిగా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేసింది. జరిమానాను నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని లేని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని కోర్టు తెలిపంది.
ఈ సందర్భంగా న్యాయం ఘనతను నిలబెట్టేందుకు , తగిన శిక్షణ విధించాలని పేర్కొన్నారు న్యాయమూర్తులు. తన పిల్లలకు బదిలీ చేసిన డబ్బులు పూర్తిగా పనికి రానివని పేర్కొంది.
గ్రహీతలు ఆ మొత్తాన్ని 8 శాతం వడ్డీతో నాలుగు వారాల్లోగా రికవరీ అధికారికి తిరిగి ఇవ్వాలంటూ ఆదేశించింది కోర్టు. ఒకవేళ ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వక పోతే విజయ్ మాల్యా ఆస్తులను అటాచ్ చేసుకోవచ్చంటూ తీర్పు చెప్పింది.
యుయు లలిత్, ఎస్. రవీంద్ర భట్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.
Also Read : 5జీ స్ప్రెక్టం వేలం పైనే అదానీ ఫోకస్