Vinesh Phogat : గంగూలీ కామెంట్స్ పై రెజ్లర్ల గుస్సా
మద్దతు ఇవ్వండి లేదంటే మౌనం పాటించండి
Vinesh Phogat : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీపై నిప్పులు చెరిగారు భారత మహిళా రెజ్లర్లు. వాళ్లు ఎందుకు దీక్ష చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఆదివారం రెజ్లర్లు దాదాపై భగ్గుమన్నారు. గంగూలీ చేసిన ప్రకటనపై మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat) సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
ఒక క్రీడాకారుడిగా తమకు గంగూలీ అంటే గౌరవం ఉందని కానీ వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోకుండా కామెంట్స్ చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ఇలాంటి కామెంట్స్ వల్ల తనపై ఉన్న గౌరవం మరింత తగ్గేలా చేస్తుందన్నారు.
తాము లైంగిక వేధింపులకు, శారీరిక ఇబ్బందులకు గురయ్యామని ఆ వేదన ఏమిటో తమకు మాత్రమే తెలుస్తుందన్నారు. అద్దాల భవంతుల్లో, సకల సౌకర్యాలతో భోగాలు అనుభవిస్తున్న సౌరవ్ గంగూలీకి తమ పరిస్థితి తెలుస్తుందని తాను అనుకోవడం లేదన్నారు వినేష్ ఫోగట్(Vinesh Phogat).
తమ న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వాలని అనుకుంటే తాను జంతర్ మంతర్ కు రావచ్చని తెలిపారు. అథ్లెట్ గా తమ సమస్యలు అర్థం చేసుకోవాలని సూచించారు. కానీ అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని కోరారు వినేష్ ఫోగట్. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : బీజేపీ చిల్లర రాజకీయం – చిదంబరం