Virat Kohli RCB WPL : ఓడి పోయినా పోరాటం ఆపొద్దు
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ
Virat Kohli RCB WPL : భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ మరోసారి వైరల్ గా మారారు. ఆయన ముంబై వేదికగా మహిళల ప్రిమీయర్ లీగ్ లో భాగంగా తన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంతో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేశారు. తాను కూడా ఐపీఎల్ లో ఆడుతున్నానని కానీ తన సారథ్యంలో ఇప్ప టి దాకా కప్పు గెలవలేదన్నారు. కానీ ఎక్కడా పోరాటాన్ని ఆపలేదని గుర్తు చేశారు. ఆట అన్నాక గెలుపు ఓటములు సహజమేనని స్పష్టం చేశారు విరాట్ కోహ్లీ(Virat Kohli RCB WPL) .
ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఇక డబ్ల్యూపీఎల్ లీగ్ లో ఆరు మ్యాచ్ లు ఆడింది ఆర్సీబీ. ఒక్క మ్యాచ్ మాత్రమే గెలుపొందింది. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న జట్టుకు ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు విరాట్ కోహ్లీ. 15 ఏళ్లుగా ఐపీఎల్ లో ఆడుతూనే వచ్చాను.
ఎన్నోసార్లు కీలకమైన పాత్ర పోషించాను. కానీ గెలవలేదన్న బాధ తనకు లేదన్నాడు. గెలుపు ఓటములను సమానంగా చూడాలని సూచించాడు విరాట్ కోహ్లీ. మైదానంలోకి వచ్చే సరికి ప్రతి ఒక్కరు అద్భుతంగా ఆడాలని భావిస్తారు. కానీ అలా ఉండదు. కొందరు సక్సెస్ అవుతారు. మరికొందరు అంచనాలకు మించి అద్బుతంగా ఆడతారని పేర్కొన్నాడు. గెలిచినా ఓడినా చివర బంతి వరకు మ్యాచ్ అయి పోలేదని గుర్తించాలని, ఆ దిశగా ఆడాలని స్పష్టం చేశాడు మాజీ కెప్టెన్(Virat Kohli).
ప్రతి ఏడాది కప్ దక్కుతుందన్న ఆశ ఉండదు. కానీ ప్రతిసారి మనం 100 శాతం పర్ ఫార్మెన్స్ ఇస్తామన్న నమ్మకం ఉండాలన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది.
Also Read : 188 రన్స్ కే ఆసిస్ ఆలౌట్