Virat Kohli : విరాట్ కోహ్లీకి ఆసియా కప్ అగ్ని పరీక్ష
ఆడితే బెటర్ లేకుంటే ఇబ్బందికరమే
Virat Kohli : భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్ లో ఎన్నడూ లేనంతటి ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. గత కొన్నేళ్లుగా సెంచరీ చేసిన దాఖలాలు లేవు. కానీ అడపా దడపా హాప్ సెంచరీలు తప్పా ఆశించిన రీతిలో రాణించడం లేదు.
ఇటీవల జరిగిన ఇంగ్లండ్ టూర్ లో పేలవమైన ఆట తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకానొక దశలో యూఏఈ వేదికగా ఆగస్టు 27న ప్రారంభమయ్యే ఆసియా కప్ లో ఉంటాడా లేదా అన్న అనుమానం రేకెత్తింది.
చివరకు ఉత్కంఠకు తెర దించుతూ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చోటు కల్పించింది. కానీ ఎంత వరకు రాణిస్తాడనే దానిపై ఇంకా అనుమానం కొనసాగుతూనే ఉంది.
గతంలో టన్నుల కొద్దీ పరుగులు చేసిన ఈ స్టార్ ప్లేయర్ ఇప్పుడు డిఫెన్స్ , రెండు ఫోర్లు ఆడేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఈ సమయంలో ప్రస్తుతం జరగబోయే టోర్నీలో కచ్చితంగా ఆడాల్సి ఉంది.
లేక పోతే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్ కప్ లో చోటు దక్కడం చాలా కష్టం కానుంది కోహ్లీకి(Virat Kohli) . ఇక దాయాదుల మధ్య అసలైన పోరాటం ఆగస్టు 28న పాకిస్తాన్ తో తలపడనుంది భారత్ జట్టు.
ఈ ఏడాది నాలుగు టి20 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు కోహ్లీ. ఇందులో కోహ్లీ చేసిన పరుగులు 81. అంటే మ్యాచ్ కు 20 పరుగుల చొప్పున చేశాడు.
ఫామ్ లో లేక పోవడంతో విండీస్ టూర్ లో విశ్రాంతి ఇచ్చారు. గత 12 నెలల పాటుగా ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు పరుగులు చేసేందుకు.
Also Read : జింబాబ్వే టూర్ కు టీమిండియా డిక్లేర్