Virat Kohli : ఇంగ్లండ్ తో వ‌న్డేకు కోహ్లీ దూరం

గాయం కార‌ణంగా ఆడ‌డం లేదు

Virat Kohli : ఇంగ్లండ్ టూర్ లో ఉన్న భార‌త జ‌ట్టుకు మ‌రో షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే రీ షెడ్యూల్ ఐదో టెస్టు మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఓట‌మి పాలై టి20 సీరీస్ చేజిక్కించుకుని ప‌రువు పోకుండా కాపాడుకుంది.

ఇదే స‌మ‌యంలో వ‌న్డే సీరీస్ లో భాగంగా ఇరు జ‌ట్ల మ‌ధ్య మొద‌టి వ‌న్డే మ్యాచ్ కు రెడీ అయ్యాయి. ఈ త‌రుణంలో పేల‌వ‌మైన ఆట తీరుతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న కోహ్లీ ఈ మ్యాచ్ కు దూరం కానున్నారు.

ఇదే విష‌యాన్ని ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది బీసీసీఐ. గాయం కార‌ణంగా కోహ్లీ ఆడ‌డం లేద‌ని స‌మాచారం. నిన్న జ‌రిగిన ప్రాక్టీస్ సెష‌న్ కు కూడా హాజ‌రు కాలేదు. ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య మూడు వ‌న్డే మ్యాచ్ లు జ‌రుగుతాయి.

మంగ‌ళ‌వారం ఫ‌స్ట్ వ‌న్డే , 14న రెండో వ‌న్డే , 17న మూడో వ‌న్డే ఆడుతుంది. గ‌త కొంత కాలంగా విరాట్ కోహ్లీ(Virat Kohli)  పూర్ ప‌ర్ ఫార్మెన్స్ జ‌ట్టును ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

తాజా మాజీ ఆటగాళ్లు కోహ్లిపై నిప్పులు చెరుగుతున్నారు. ఇక గుడ్ బై చెప్ప‌డం బెట‌ర్ అంటూ సూచిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే మాజీ భార‌త జ‌ట్టు కెప్టెన్ క‌పిల్ దేవ్ అయితే కోహ్లీని(Virat Kohli)  వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేశాడు.

ఇంకా ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేద‌న్నాడు. ఇక పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ దానికేష్ క‌నేరియా అయితే కోహ్లీకి విశ్రాంతి ఇవ్వండ‌ని సూచించాడు.

మొత్తంగా పేల‌వ‌మైన ఫామ్, గాయం రెండూ ఇప్పుడు ఈ స్టార్ ప్లేయ‌ర్ కు శాపంగా మారాయి.

Also Read : కోహ్లీ ఫామ్ పై రోహిత్ శ‌ర్మ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!