Virat Kohli : కింగ్ కోహ్లీ అరుదైన ఘనత
ఫోర్ల జాబితాలో రికార్డ్
Virat Kohli : ప్రపంచ క్రికెట్ లో మోస్ట్ పాపులర్ క్రికెటర్ గా పేరొందిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) దుమ్ము రేపాడు. ఐపీఎల్ 16వ సీజన్ లో సత్తా చాటుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. మొహాలీ వేదికగా గురువారం జరిగిన లీగ్ మ్యాచ్ లో అద్బుతంగా ఆడాడు. 59 రన్స్ చేశాడు. అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ లో 600 లేదా అంతకంటే ఎక్కువ ఫోర్లు కొట్టిన క్రికెటర్ గా రికార్డ్ నమోదు చేశాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 5 ఫోర్లు 1 సిక్స్ కొట్టాడు.
ఇప్పటి వరకు ఐపీఎల్ లో అత్యధిక ఫోర్లు కొట్టిన క్రికెటర్లలో టాప్ లో నిలిచాడు ప్రస్తుతం స్కిప్పర్ గా ఉన్న శిఖర్ ధావన్. విరాట్ కోహ్లీ కంటే ముందే ఈ ఘనతను సాధించిన ఆటగాళ్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారిలో ధావన్ టాప్ లో ఎవరికీ అందనంత ఎత్తులో కొనసాగుతుండడం విశేషం. ఇప్పటి దాకా మొత్తం 209 ఇన్నింగ్స్ ఆడాడు ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో. ఇందులోనే 730 ఫోర్లు బాదాడు.
ఇక విరాట్ కోహ్లీ శిఖర్ ధావన్ ను అందుకోవాలన్నా లేదా దాటాలంటే ఇంకా శ్రమించాల్సి ఉంటుంది. పలు కీలకమైన లీగ్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ఇప్పట్లో సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే భారీ ఎత్తున లీగ్ మ్యాచ్ లు ఆడడం, బిగ్ స్కోర్లు చేస్తేనే ఛాన్స్ ఉంటుంది. ఏది ఏమైనా విరాట్ కోహ్లీ సాధించిన ఈ ఘనత చెప్పుకోదగ్గదే.
Also Read : తిప్పేసిన సిరాజ్ పంజాబ్ షాక్