Virat Kohli Express : ఒడిశా రైలు ప్రమాదం బాధాకరం
తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన కోహ్లీ
Virat Kohli Express : ఒడిశాలోని బాలా సోర్ జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటనపై స్పందించాడు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli). శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకుని తాను చాలా బాధ పడ్డానని తెలిపారు. రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు విరాట్ కోహ్లీ.
ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం 6.45 నుండి 7.15 నిమిషాల వ్యవధిలో బాల సోర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. ఇదే సమయంలో ఉన్న మరో హౌరా రైలును ఢీకొనడంతో ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. బోగీలు చెల్లా చెదురుగా పడ్డాయి. దీనికి మానవ తప్పిదమేనని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఈ రైలు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 300 మంది చని పోయి ఉంటారని రైల్వే శాఖ భావిస్తోంది. 1,000 మందికి పైగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ టీమ్ లు విస్తృతంగా పని చేస్తున్నాయి. పీఎం మోదీ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఘటనపై ఆరా తీశారు. ఇప్పటికే మృతులకు రూ. 2 లక్షలు , గాయపడిన వారికి రూ. 50 వేలు సాయం ప్రకటించారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా , ప్రముఖ నటులు సోనూ సూద్, జూనియర్ ఎన్టీఆర్ , అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ సైతం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Also Read : PCB Shock to Sri Lanka