Virat Kohli Fined : విరాట్ కోహ్లీకి జరిమానా
కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన
Virat Kohli Fined : స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ సీఎస్కేతో తలపడింది. ఈ సందర్భంగా కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించినందుకు గాను విరాట్ కోహ్లీ(Virat Kohli Fined) మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది ఐపీఎల్ కమిటీ.
ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే మ్యాచ్ లకు సంబంధించి స్లో ఓవర్ రేట్ కారణంగా ఆర్సీబీ స్కిప్పర్ ఫాఫ్ డు ప్లెసిసిస్ కు రూ. 12 లక్షలు, రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ కు రూ. 12 లక్షలు, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ పాండ్యాకు రూ. 12 లక్షలు ఇప్పటికే ప్రకటించారు.
ఇందుకు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ( బీసీసీఐ) కోహ్లీకి జరిమానా విధించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలిందని పేర్కొంది. ఆర్టికల్ 2.2 ప్రకారం లెవల్ 1 నేరాన్ని కోహ్లీ(Virat Kohli) అంగీకరించినట్లు వెల్లడించింది.
అడ్వైజరీ లో ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ సీఎస్కే బ్యాటర్ శివమ్ దూబేను అవుట్ చేసిన తర్వాత కోహ్లీ పిచ్చిగా కేకలు వేస్తూ సంబురం చేసుకున్నాడు. దూబే 26 బంతులు ఆడి 52 రన్స్ చేశాడు. పేసర్ వేన్ పార్నెల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
Also Read : ధోనీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ