Virat Kohli MS Dhoni : విరాట్ కోహ్లీ ధోనీ ఫోటో వైర‌ల్

ఆనాటి జ్ఞాప‌కాలు ప‌దిలం

Virat Kohli MS Dhoni : ప్రపంచ క్రికెట్ లో మోస్ట్ ఫేవ‌ర‌బుల్ క్రికెటర్ గా పేరొందాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) . ఆట‌గాడిగా , కెప్టెన్ గా స‌క్సెస్ అయ్యాడు. అనుకోని రీతిలో నాయ‌క‌త్వం నుంచి త‌ప్పుకున్నాడు.

గ‌త ఏడాది యూఏఈ వేదిక‌గా జ‌రిగిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఇదిలా ఉండ‌గా కొన్నేళ్ల నుంచి కోహ్లీ త‌న స‌హ‌జ సిద్ద‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించ‌డం లేదు.

తీవ్రంగా విఫ‌ల‌మ‌వుతూ వ‌చ్చాడు. ఈ మ‌ధ్య కాలంలో హాఫ్ సెంచ‌రీ చేసింది ఒక‌టి రెండు సార్లే. ఒక‌ప్పుడు ట‌న్నుల కొద్దీ ప‌రుగులు సాధించిన ఈ క్రికెట‌ర్ ఇప్పుడు రెండు, సింగిల్స్ తీసేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం ఫ్యాన్స్ ను, మాజీ ఆట‌గాళ్ల‌ను విస్తు పోయేలా చేస్తోంది.

అయితే క్రికెట్ లో ప్ర‌తి ఆట‌గాడికి ఇలాంటి స్థితి ఎదుర‌వుతుంద‌ని ఇందులో బాధ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని స‌ర్ది చెబుతున్నారు. ఒకానొక స‌మ‌యంలో త‌ను జ‌ట్టుకు ఎంపిక అవుతాడా అన్న అనుమానం కూడా నెల‌కొంది.

చివ‌ర‌కు ఆసియా క‌ప్ లో ఆడేందుకు ఎంపిక కావ‌డంతో ర‌న్ మెషీన్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్ర‌స్తుతం ఆసియా క‌ప్ లో ఎలాగైనా స‌త్తా చాటాలని ప్రాక్టీస్ లో నిమ‌గ్నం అయ్యాడు.

విచిత్రం ఏమిటంటే విరాట్ కోహ్లీ తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా అరుదైన ఫోటోను షేర్ చేశాడు. ఈ సంద‌ర్భంగా మాజీ కెప్టెన్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీని(MS Dhoni) గుర్తు చేసుకున్నాడు.

నీకు డిప్యూటీగా ఉన్నందుకు ఆనందంగా ఉంద‌ని పేర్కొన్నాడు. ఈ ఫోటోను చూసిన వాళ్లంతా ఒక‌వేళ రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తాడా అని ట్రోల్ చేస్తున్నారు.

Also Read : ఫామ్ నాకో లెక్క కాదు – ర‌న్ మెషీన్

Leave A Reply

Your Email Id will not be published!