Virat Kohli : భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన కామెంట్స్ చేశాడు. భారత మహిళా జట్టు (Indian Women’s Team) దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో చివరి దాకా జరిపిన పోరాటం స్పూర్తి దాయకమని పేర్కొన్నాడు.
మిథాలీ, స్మృతి మంధాన (Smriti Mandhana) , హర్మన్ ప్రీత్ కౌర్ (Harman Preet Kaur) అద్భుతమైన ప్రదర్శన చేశారు. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్న రీతిలో పోరు సాగింది. ఎవరు గెలుస్తారో చెప్పలేనంత ఉత్కంఠ నెలకొంది.
ఇదే సమయంలో అంపైర్ నోబాల్ ప్రకటించడం వల్లనే భారత్ జట్టు సెమీస్ కు చేర లేక పోయిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా భారత జట్టు ఓడి పోయినా కోట్లాది మంది క్రీడాభిమానుల మనసు దోచుకున్నారు.
ఈ సందర్భంగా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేశం గర్వ పడేలా ఆడారంటూ కితాబు ఇచ్చాడు. మీరు ప్రదర్శించిన పోరాటం అసమాన్యం.
ఆట అన్నాక గెలుపు ఓటములు సహజం. కానీ చివరి దాకా కనబర్చిన పట్టుదల, సమిష్టిగా ఆడిన విధానం దేశంలోని వర్ధమాన క్రీడాకారులకు, మహిళా ప్లేయర్లకు స్పూర్తి దాయకంగా నిలుస్తుందని పేర్కొన్నాడు విరాట్ కోహ్లీ.
భారత జట్టు భారీ స్కోర్ చేయడంలోనే కాదు ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడంలో చూపిన ప్రతిభ అసామన్యమని కొనియాడాడు. మీరు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న టోర్నీ నుంచి నిష్క్రమించడం కఠినమైనది.
కానీ మీ అసమాన పోటీతత్వంతో మమ్మల్నే కాదు యావత్ భారత ప్రజల మనసు దోచుకున్నారంటూ ప్రశంసించాడు కోహ్లీ.
Also Read : హైదరాబాద్ గెలిచేనా రాజస్థాన్ నిలిచేనా