Rohit Sharma : కోల్ కతా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ముందుగా బ్యాటింగగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
రిషబ్ పంత్ తో పాటు విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ అద్భుతంగా రాణించారు. ప్రత్యేకించి ఇటీవల ఫామ్ లేమితో నానా తంటాలు పడుతున్న మాజీ భారత జట్టు స్కిప్పర్ విరాట్ కోహ్లీ కోల్ కతా వేదికగా రాణించారు.
కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. ఈ మ్యాచ్ లో భారత జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం చేసుకుంది.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మీడిఆయతో మాట్లాడాడు. ప్రత్యేకంగా విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఒత్తిడిలో సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆడటం ఒక్క విరాట్ కే చెల్లిందన్నాడు.
తనకు కోహ్లీలో నచ్చే గుణం ఒక్కటే ఎక్కడా ఓటమి ఒప్పుకోడు. బయట ఎంత జోవియల్ గా ఉంటాడో మైదానంలోకి వచ్చాక భయంకరమైన ఆటగాడిగా ఉంటాడని కితాబు ఇచ్చాడు.
41 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 7 ఫోర్లు ఓ సిక్సర్ తో 52 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడని కితాబు ఇచ్చారు రోహిత్ శర్మ(Rohit Sharma). ఒకానొక సమయంలో మొదట్లోనే వికెట్లు పోగొట్టుకున్నాం.
కానీ పంత్ , కోహ్లీ ప్రత్యర్థి టీంకు ఎలాంటి చాన్స్ ఇవ్వలేదన్నాడు. ఆ తర్వాత జట్టు విజయం సునాయసంగా దక్కిందన్నారు. బ్యాటర్ లతో పాటు బౌలర్లు కూడా తమ సత్తా చాటారని పేర్కొన్నాడు.
Also Read : రంజీలో సకీబుల్ గని వరల్డ్ రికార్డ్