Vistara Airlines : వ‌ర‌ల్డ్ టాప్ ఎయిర్ లైన్స్ ల‌లో ‘విస్తారా’

20 ఎయిర్ లైన్స్ ల‌లో విస్తారాకు చోటు

Vistara Airlines : విస్తారా ఎయిర్ లైన్స్ అరుదైన ఘ‌న‌త(Vistara Airlines) సాధించింది. ఈ ఏడాది 2022కి గాను ప్రపంచం లోని 20 అత్యుత్త‌మ విమాన‌యాన సంస్థ‌ల జాబితాలో చోటు ద‌క్కించుకుంది. స్కైట్రాక్స్ వ‌ర‌ల్డ్ ఎయిర్ లైన్ అవార్డ్స్ 2022 లో ఖ‌తార్ ఎయిర్ వేస్ వ‌ర‌ల్డ్ లోనే అత్యుత్త‌మ విమాన‌యాన సంస్థ‌గా ఎంపికైంది.

ఇక ఎప్ప‌టి లాగే సింగ‌పూర్ ఎయిర్ లైన్స్ లిమిటెడ్ , ఎమిరేట్స్ వ‌రుస‌గా రెండు , మూడు స్థానాల‌లో నిలిచాయి. ఇక ఆసియా – ప‌సిఫిక్ క్యారియ‌ర్ ల‌కు

బ‌ల‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌లో జ‌పాన్ కు చెందిన ఆల్ నిప్పాన్ ఎయిర్ వేస్ కో, ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ ఎయిర్ వేస్ లిమిటెడ్ మొద‌టి ఐదు స్థానాల్లో నిలిచాయి.

ఇదిలా ఉండ‌గా హాంగ్ కాంగ్ కు చెందిన క్యాథో ప‌సిఫిక్ గ‌త ఏడాది 2021లో ఆర‌వ స్థానం నిలువ‌గా ఈఏడాది ప్ర‌క‌టించిన జాబితాలో 16వ స్థానానికి ప‌డి పోయింది.

ప్ర‌తి క్యాబిన్ త‌ర‌గ‌తికి ఉత్త‌మ విమాన‌యాన సంస్థ‌ను కూడా అవార్డులు వ‌రించాయి. ఉత్త‌మ ఫ‌స్ట్ క్లాస్ క్యాబిన్ సింగ‌పూర్ ఎయిర్ లైన్స్ కు వెళ్ల‌గా ఖ‌తార్

ఉత్త‌మ బిజినెస్ క్లాస్ ను ఎంచుకుంది.

ఇక ప్రీమియం ఎకాన‌మీ కోసం వ‌ర్జిన్ అట్లాంటిక్ ఎయిర్ వేస్ లిమిటెడ్ , ఉత్త‌మ ఎకాన‌మీ క్యాబిన్ గా ఎమిరేట్స్ గెలుపొందాయి. సింగ‌పూర్ ఎయిర్ లైన్స్

బ‌డ్జెట్ క్యారియ‌ర్ త‌క్కువ ధ‌ర ఎయిర్ వేస్ గా అగ్ర‌స్థానంలో నిలిచింది.

సింగ‌పూర్ ఎయిర్ లైన్స ఉత్త‌మ క్యాబిన్ సిబ్బందిని ఎంపిక చేసింది. ఏఎన్ఏ క్యాబిన్ శుభ్ర‌త‌లో మొద‌టి స్థానంలో నిలిచాయి. ఇదిలా ఉండ‌గా 2022కి

సంబంధించి టాప్ ఎయిర్ లైన్స్ ఇలా ఉన్నాయి.

ఖ‌తార్ ఎయిర్ వేస్ , సింగ‌పూర్ ఎయిర్ లైన్స్ , ఎమిరేట్స్ , ఆల్ నిప్పాన్ ఎయిర్ వేస్ , క్వాంటాస్ ఎయిర్ వేస్ , జపాన్ ఎయిర్ లైన్స్ , ట‌ర్కిష్ ఎయిర్ లైన్స్ , ఫ్రాన్స్ ఎయిర్ వేస్ ఉన్నాయి.

వీటితో పాటు స్విస్ ఎయిర్ లైన్స్ , బ్రిటిష్ ఎయిర్ వేస్ , ఎతిహాద్ ఎయిర్ వేస్ , చైనా ద‌క్షిణ‌, హైనాన్ ఎయిర్ లైన్స్ , లుప్తాన్సా, కాథే ప‌సిఫిక్ , కేఎల్ఎం,

ఈవీఏ ఎయిర్ వేస్ , వ‌ర్జిన్ అట్లాంటిక్ , విస్తారా ఎయిర్ లైన్స్(Vistara Airlines) ఉన్నాయి.

Also Read : స‌ద్గురు..సీఎం శ‌ర్మ అర్ధ‌రాత్రి షికారు

Leave A Reply

Your Email Id will not be published!