Vistara Merge Air India : ఎయిర్ ఇండియాతో విస్తారా విలీనం
భారీ డీల్ కుదుర్చుకున్న టాటా సన్స్
Vistara Merge Air India : భారతీయ ప్రముఖ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ సంచలన ప్రకటన చేసింది. ఇప్పటికే ఎయిర్ ఇండియాను టేకోవర్ చేసుకుంది. కీలక మార్పులు చేసింది. మెల మెల్లగా ఎయిర్ ఇండియాను టాప్ ఎయిర్ లైన్స్ గా మార్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు పావులు కదుపుతోంది.
ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్ పోర్టులకు ఇండియా నుంచి నడపాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మంగళవారం టాటా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఎయిర్ ఇండియాతో విస్తారా ఎయిర్ లైన్స్ ను(Vistara Merge Air India) విలీనం చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
అధికారికంగా ధ్రువీకరించింది. టాటా గ్రూప్ విస్తారాలో 51 శాతం వాటాను కలిగి ఉంది. మిగిలిన 49 శాతం వాటా సింగపూర్ ఎయిర్ లైన్స్ తో కలిపి ఉంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ విస్తారా ఇక నుంచి ఒకే గొడుగు కిందకు వస్తాయి. అంటే ఎయిర్ ఇండియా పేరుతో అవి నడుస్తాయని సంస్థ తెలిపింది.
ఎయిర్ ఇండియా 218 విమానాల సంయుక్త ఫ్లీట తో ముందుకు వెళుతుందని పేర్కొంది. దేశంలో ప్రముఖ అంతర్జాతీయ క్యారియర్ గా అవతరిస్తుందని స్పష్టం చేసింది టాటా గ్రూప్. ఇదిలా ఉండగా ఎయిర్ ఇండియా పూర్తిగా టాటా సన్స్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ. భారత దేశానికి సంబంధించిన ఫ్లాగ్ క్యారియర్ గా ఉంది.
తలాస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ ఏడాది జనవరి 27న ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది.
Also Read : ప్రపంచ కుబేరుల్లో అదానీ..అంబానీ