Vivek Agnihotri : దేశమంతటా ది కశ్మీర్ ఫైల్స్ సెన్సేషన్ క్రియేట్ చేసింది (Kashmir files). ఒక్కసారిగా ఈ సినిమాలో ఏముందో కంటే ఈ చిత్రాన్ని తెర కెక్కించిన డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి (Vivek Agnihotri)ఎవరని వెతకడం ప్రారంభమైంది.
1980 నాటి చివరలో 1990లో మొదట్లో జమ్మూ కాశ్మీర్ లో చోటు చేసుకున్న దారుణాలు, పాకిస్తాన్ ఉగ్రవాదులు సాగించిన మారణకాండను సినిమాతో తెరకెక్కించాడు.
ఎవరూ ఊహించని రీతిలో రూ. 100 కోట్ల మార్క్ ను దాటేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఓవర్సీస్ లో దుమ్ము రేపుతోంది. ఎన్నో ప్రశంసలు మరెన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివేక్ అగ్నిహోత్రి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. (Indian Film director) భారతీయ చలన చిత్ర దర్శకుడిగా పేరొందారు. స్క్రీన్ టైటర్, దర్శకుడిగా పని చేస్తున్నాడు
హిందీ చిత్ర పరిశ్రమలో. తాను దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పూర్తి మద్దతుదారుడినంటూ బహిరంగంగానే ప్రకటించాడు.
దీంతో ప్రస్తుతం వివేక్ తీసిన కశ్మీర్ ఫైల్స్ కు మోదీ బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. 2019లో భారత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ లో సభ్యుడిగా ఉన్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ లో భారతీయ సినిమా (Indian Cinema) సాంస్కృతిక ప్రతినిధిగా పని చేస్తున్నారు. 2019లో ది తాష్కెంట్ ఫైల్స్ మూవీకి సంబంధించి ఉత్తమ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కు గాను జాతీయ చలన చిత్ర పురస్కారం పొందాడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) Vivek Agnihotri .
తన కెరీర్ ను యాడ్ ఏజెన్సీతో ప్రారంభిఒంచాడు. టెలి, సీరియల్ ల నిర్మాణంతో పాటు దర్శకత్వం వహించాడు. క్రైమ్ థ్రిల్లర్ మూవీ చాక్లెట్ తో బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యాడు.
2005లో ఈ మూవీ వచ్చింది. ప్రముఖ నటి పల్లవి జోషిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భోపాల్ స్కూల్ ఆఫ్ సైన్సెస్ , జేఎన్ యూలో చదివారు.
ఇక జిల్లెట్ , కోకో కోలా ప్రచారాలకు క్రియేటివ్ డైరెక్టర్ గా పని చేశాడు. 2018లో మొహమ్మద్ ఊర్వశి పేరుతో షార్ట్ ఫిలిం తీశాడు. బెదిరింపులు ఎదుర్కొన్నాడు.
2017లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రివ్యూ కమిటీలో అగ్ని హోత్రిని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ కన్వీనర్ గా ఎంపిక చేసింది.
ది హేట్ తీశాడు. బుద్ద ఇన్ ఏ ట్రాఫిక్ జామ్ లో పల్లవి జోషి నటించింది. 2014లో ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. తాజాగా తీసిన ది కశ్మీర్ పైల్స్ కు సంబంధించి బెదిరింపులు రావడంతో కేంద్ర సర్కార్ వై కేటగిరీ భద్రత కల్పించింది.
Also Read : దాడుల పరంపర ఆగని మారణకాండ